వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌!

  • September 29, 2022 / 12:49 PM IST

సినిమా విడుదలై నెల తిరగడం ఆలస్యం.. ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమా నిర్మాతల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కాకుండా, ముందుగానే వచ్చేస్తోంది అనే విషయం మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. ఆ సినిమానే ‘రంగ రంగ వైభవంగా’. వైష్ణవ్‌ తేజ్‌, హీరోగా నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో అక్టోబరు 2 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 2న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకు ఆశించిన విజయం దక్కలేదు. పాత సినిమాల వాసనలు ఉండటం, ఆసక్తికరమైన అంశాలు లేకపోవడంతో సినిమా బాక్సాఫీసు దగ్గర తేలిపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. థియేటర్లలో ఆడిన సినిమాలు.. ఓటీటీలో ఆడవు. ఓటీటీలో ఆడే సినిమాలు థియేటర్ల ఆడవు అని అంటుంటారు. మరి ఈ సినిమా సంగతి చూడాలి.

ఓటీటీలో విడుదల వెయిట్‌ చేస్తూ.. ఈ లోపు సినిమా కథ గురించి క్లుప్తంగా చదివేయండి. స్నేహానికి నిద‌ర్శనంగా రాముడు (ప్రభు), చంటి (న‌రేష్‌) గురించి చెబుతుంటారు. చంటి కొడుకు రిషి (వైష్ణవ్ తేజ్‌), రాముడు కూతురు రాధ (కేతికా శ‌ర్మ‌) ఒకే రోజున‌, ఒకే ఆస్పత్రిలో జ‌న్మిస్తారు. తొలుత అందరిలా స్నేహితులైన రిషి, రాధ‌ స్కూలులో చదువుకుంటున్నప్పుడే ప్రేమగా మారుతుంది. కానీ, ఓ చిన్న సంఘ‌ట‌న వీరి మ‌ధ్య దూరం పెరుగుతుంది.

ఆ తర్వాత ఇద్దరూ పంతాల‌కు పోయి మాట్లాడుకోవ‌డం మానేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వీరి మధ్య ఇగో వార్ చ‌ల్లారి, ఇద్దరూ ఒక్కటవుతున్నారు అనుకునేలోపు కుటుంబాల్లో మ‌రో ప్రేమ‌క‌థ అలజ‌డి రేపుతుంది. అది రిషి అన్నయ్య‌, రాధ అక్క ప్రేమ‌క‌థ‌. వీరి వ‌ల్ల రిషి – రాధ‌ ప్రేమకు కలిగిన ఇబ్బంది ఏంటి? ప్రాణ స్నేహితులుగా ఉన్న కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు ఎందుకు వచ్చాయి? కార‌ణ‌మేంటి? రెండు కుటుంబాల్ని ఒక్కటి చేయ‌డానికి రిషి ఏం చేశాడు? అన్నది సినిమా కథ.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus