Rangabali Teaser: నాగ శౌర్య ఈసారి పెద్ద హిట్ కొట్టేలా ఉన్నాడుగా..!

‘రంగబలి’ .. ఈ టైటిల్ చూస్తున్నా.. వింటున్నా … ‘ది కాంబినేషన్ ఆఫ్ ‘రంగ’స్థలం+ బాహు’బలి’ ‘ అనే ఫీలింగ్ కలుగుతోంది కదూ.! కానీ ఇది పక్కా యూత్ ఫుల్ సబ్జెక్ట్. యువ కథానాయకుడు నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీని పవన్ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుండగా… సత్య, బ్రహ్మాజీ, గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో(దసరా విలన్) వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జూలై 7 న ఈ చిత్రం (Rangabali) విడుదల కాబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన టీజర్ తో స్పష్టం చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ‘కుర్రాళ్లంటే ఈ వయసులో ఇలాగే ఉంటార్రా.. నువ్వేం కంగారు పడకు’ ‘మా వాడు ఎంత వెధవ అనేది అనేది నేను చెప్పలేను.. దాని దేవుడు వరం ఇవ్వాలి’ వంటి డైలాగులతో టీజర్ మొదలైంది. హీరో పక్కా ఆవారా అని ఈ రెండు డైలాగులతో అతని క్యారెక్టరైజేషన్ ఏంటి అన్నది తెలిపారు.

అలాంటి అబ్బాయి ఓ అమ్మాయి వెంటపడటం, ప్రేమలో పడటం వంటివి చూపించారు. సత్య కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంది. నాగ శౌర్య గోదావరి యాసలో మాట్లాడుతున్నాడు. ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రానికి సంగీతం అందించి ఆ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ సి.హెచ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టీజర్ రెగ్యులర్ గానే ఉన్నా కామెడీ ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. ‘ఛలో’ తర్వాత నాగ శౌర్య ఇలాంటి కంప్లీట్ ఎంటర్టైనర్ చేయలేడు. ఈ మూవీతో అతను సూపర్ హిట్ అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus