Rangamarthanda: ‘రంగ మార్తాండ’ కష్టాలు తీరుతాయా.. మంచి సినిమా బాసూ!

దాస్ కా ధమ్కీగత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఏ సినిమా జనం ప్రొఫైల్‌ చూసినా ఇదే మాట కనిపిస్తోంది. ఇదే మాట కాకపోయినా ఇంచుమించు ఇదే మాట చూడొచ్చు. కొంతమంది అయితే తమ స్నేహితులకు ఫోన్‌ చేసి మరీ ‘రంగమార్తాండ’ కచ్చితంగా చూడాలి, ‘బ్రహ్మానందం ఇరగ్టొట్టేశాడు’ అని చెబుతున్నారు. ఒకరో ఇద్దరో చెబితే ఓకే.. సినిమాలతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి తమ స్నేహితులతో, సోషల్‌ మీడియాలో ఇదే మాట చెబుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇదే మాట అంటున్నారు. దీంతో అసలేం జరుగుతోంది అనే డౌట్‌ వస్తోంది.

‘రంగ మార్తాండ’ నిజంగా అంత బాగుందా? వచ్చాక చూద్దాం! అనే మాట అయితే సగటు వ్యక్తి నోట వినిపిస్తోంది. కానీ ఇదంతా సినిమా వచ్చే ముందు, వచ్చాక ఉంటుందా? అనే భయం కూడా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా జనాలు ‘మంచి మాస్‌ సినిమాలు చూస్తారు’ తప్ప .. మంచి సినిమాలు అంతగా చూడరు అనే మాట ఉంది. ఈ మాట నింద కాదు.. గతంలో జరిగిన సత్యం. తర్వాత ఆ సినిమా ఎప్పుడో టీవీల్లో, ఓటీటీల్లో వస్తే ‘ఇంత మంచి సినిమా థియేటర్లలో మిస్‌ అయ్యామా?’ అనిపిస్తుంది అంటుంటారు.

ఇప్పుడు ‘రంగమార్తాండ’ సినిమాకు ఇంత క్రేజ్‌, హైప్‌ రావడానికి కారణం బ్రహ్మానందం ఒక్కరే కాదు. ఈ సినిమా దర్శకుడు కృష్ణవంశీ కూడా. ఎన్నో క్రియేటివ్‌ సినిమాలు తీసి క్రియేటివ్‌ డైరక్టర్‌ అనిపించుకున్న కృష్ణవంశీ.. ఇప్పుడు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. ఏ సినిమా ముట్టుకున్నా మంట పెట్టి మొత్తంగా ఇబ్బందిపడ్డారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన ‘రంగమార్తాండ’ మీద సినిమా ఇండస్ట్రీలో సాఫ్ట్‌ కార్నర్‌ ఉంది. దీంతో చాలామంది సెలబ్రిటీలు సినిమాలు చూసి టీమ్‌ను ఎంకరేజ్‌ చేసేలా మాటలు చెబుతున్నారు.

‘నట సామ్రాట్’ అనే మరాఠీ సినిమాను ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేశారు కృష్ణవంశీ. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ సినిమా లేట్‌ అయ్యి అయ్యి ఈ నెల 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే సినిమాకు భారీగా డబ్బులు రావాలి అంటున్నారు. దానికి ఇప్పుడు సోషల్‌ మీడియా బజ్‌ ఉపయోగపడాలి. దీని కోసమే కృష్ణవంశీ ప్రయత్నం అని చెబుతున్నారు. మరి ట్వీట్లు రాలుస్తున్న ఈ సినిమా కాసులు రాలుస్తుందా అనేది చూడాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus