భారీ రేటుకి ‘రంగ దే’ శాటిలైట్ రైట్స్….!

మూడు డిజాస్టర్ లు పడ్డాక… కొంచెం గ్యాప్ తీసుకుని నితిన్ ఈ ఏడాది ‘భీష్మ’ చిత్రంతో హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇదే జోష్ లో తన తరువాతి చిత్రంతో కూడా మరో సూపర్ హిట్టు కొట్టాలని తెగ ట్రై చేస్తున్నాడు. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’, అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ వంటి లవ్ స్టోరీలను తెరక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

‘మహానటి’ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు కూడా భారీ రేటు పలికిందట.అందుతున్న సమాచారం ప్రకారం… ప్రముఖ టీవీ ఛానెల్ అయిన ‘జీ తెలుగు’ వారు…

‘రంగ్ దే’ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను ఏకంగా 11 కోట్లు పెట్టి కొనుగోలు చేసారట. నితిన్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ అని తెలుస్తుంది. అంతే కాదు మీడియం రేంజ్ హీరోలలో కూడా ఇదే రికార్డు అని తెలుస్తుంది. కీర్తి సురేష్ కు ఉన్న క్రేజ్ … నితిన్ ‘భీష్మ’ తో సాలిడ్ హిట్ కొట్టి ఫామ్లోకి రావడం.. నిర్మాతలు కూడా వరుస హిట్లతో దూకుడు మీద ఉండడం వంటివి… జీ వారు అంత ధర పెట్టడానికి కారణమై ఉండొచ్చు… అని కొందరు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus