Rao Ramesh: లేట్ అయితే అయ్యింది కానీ… ఆయన అదిరిపోయే పాత్ర పట్టేశారట!

‘ఇన్ని సినిమాలు చేస్తున్నావ్‌… నాతో నటించవా’ ఈ మాట చిరంజీవి ఓ నటుడితో అన్నారు అంటే… ఆ నటుడి టాలెంట్‌ ఎలాంటిదో మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ఆ మాట అలా చిరంజీవి అన్నారో లేదో… ఇలా దర్శకుడు వశిష్ట మల్లిడి తన సినిమాలో ఓకే చేసేశారు. ఆ మాట అనిపించుకున్న నటుడు రావు రమేశ్‌ అయితే… ఇప్పుడు నటిస్తున్న ‘విశ్వంభర’ అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఆ కాంబో ఫిక్స్‌ అయింది అంటున్నారు.

ప్రీ ప్రొడక్షన్‌ తర్వాత చిన్న చిన్న గ్యాప్‌లు వచ్చినా… ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా సెట్‌లోకి ఇటీవల రావు రమేశ్‌ ఎంట్రీ ఇచ్చారని టాక్‌ నడుస్తోంది. ఈ సినిమాలో మెయిన్‌ విలన్స్‌లో ఒకరిగా రావు రమేశ్‌ తన వెర్సటైన్‌ విలనీని చూపించబోతున్నారట. విలక్షణ నటుడు రావు గోపాల్ రావు – చిరంజీవి కాంబినేషన్‌లో చాలా సినిమాలొచ్చాయి. అన్నింటిలోనూ ఆ ఇద్దరి కాంబోకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది కూడా.

అలాంటి రావు గోపాలరావు వారసుడు రావు రమేష్ (Rao Ramesh) ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు చిరంజీవితో ఆయనకు సినిమా పడలేదు. దీంతో ఏదో మిస్సింగ్‌ ఆయన లైఫ్‌లో అనిపించేది. నాన్నకు తెర మీద సవాల్ విసిరిన చిరంజీవికి విలన్‌గా నటించాలనేది ఆయన కోరిక కూడా. ‘విశ్వంభర’ సినిమాతో ఆ కోరిక తీరనుందనే అప్‌డేట్ ఇప్పుడు వచ్చింది.

ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో సాగే ‘విశ్వంభర’ సినిమాలో గాల్లో తిరిగే ఒక విచిత్రమైన మాంత్రికుడి పాత్రలో రావు రమేశ్‌ నటిస్తున్నారని టాక్‌. జనవరి 10, 2025న ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగా ప్లాన్స్‌ నడుస్తున్నాయట. ఇందులో హీరోయిన్‌గా ఇప్పటికే త్రిషను ఫైనల్‌ చేశారు. ఆమె సెట్‌లోకి వచ్చారు కూడా. అయితే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారని టాక్‌.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus