సినీ పరిశ్రమ మళ్ళీ కోలుకోవాలంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ లేదా ‘కె.జి.ఎఫ్ 2’ సినిమాల వల్లే అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ ఈ ఏడాది విడుదల కావడం కష్టమనే టాక్ బలంగా వినిపిస్తోంది. దసరా వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అంతా సెట్ అయ్యి థియేటర్లు తెరుచుకున్నా.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. కాబట్టి ‘కె.జి.ఎఫ్ 2’ వంటి పెద్ద సినిమా విడుదలైతేనే మళ్ళీ బాక్సాఫీస్ కళకళలాడుతుంది.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కన్నడ సినిమా అయినప్పటికీ తెలుగు ఆర్టిస్ట్ లు కూడా నటిస్తున్నారు. ఆల్రెడీ పార్ట్ 1 ఇక్కడ పెద్ద హిట్ అయ్యింది కాబట్టి… ఇది కూడా ఘన విజయం సాధించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విలక్షణ నటుడు రావు రమేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు అతని పుట్టినరోజు కావడంతో..’కె.జి.ఎఫ్ 2′ లో ఈయన పాత్రను రివీల్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఈ చిత్రంలో ఆయన కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర పోషిస్తున్నాడు. అది ఓ సిబిఐ ఆఫీసర్ పాత్ర. రాకీ భాయ్ కేసును డీల్ చేసే స్పెషల్ ఆఫీసర్ గా ఆయన కనిపించబోతున్నాడట.మరి ఈ పాత్రతో ఆయన ఎలా ఆకట్టుకుంటాడో తెలియాల్సి ఉంది. కానీ ‘కె.జి.ఎఫ్2’ టీం రావు రమేష్ నే కాదు తెలుగు ప్రేక్షకులను కూడా సర్ప్రైజ్ చేసారని చెప్పాలి.