Rashmi: కీలక నిర్ణయం తీసుకున్న యాంకర్‌ రష్మీ.. ఇకపై దానికి దూరంగా..

ఒకప్పుడు సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటే అంతగా నేటి తరంతో కనెక్ట్‌ అయినట్లు అనుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటే నేటి తరానికి సింక్‌ అయినట్లు చెబుతున్నారు. దీనికి కారణం ‘డిజిటల్‌ డిటాక్స్‌’. దీని అర్థం సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం. సెలబ్రిటీలు, కొంతమంది యువత ప్రస్తుతం ఇదే దారిలో ఉన్నారు. అలా స్టార్‌ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ కూడా అదే పని చేస్తోంది. ‘ఏదీ శాశ్వతం కాదు. ఈ కాలం కూడా గడిచిపోతుంది. మళ్లీ కలుద్దాం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. కొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

Rashmi

‘‘నెల రోజుల పాటు డిజిటల్‌ డిటాక్స్‌ పాటించాలని అనుకుంటున్నా. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాను. సోషల్ మీడియా కూడా అందులో భాగమే. కొన్నిసార్లు మన ఆలోచనలను సోషల్‌ మీడియా ప్రభావితం చేస్తోంది. అందుకే కొన్ని రోజులు దీనికి దూరంగా ఉంటాను. నేను నా శక్తియుక్తులను రెస్టోర్‌ చేసుకుంటారు. డిజిటల్ ప్రభావం లేకుండా నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి అనుకుంటున్నాను. నేనెప్పుడూ బలంగా ఉంటాను. కానీ కొన్నిసార్లు కుంగిపోతున్నాను. కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం’’ అని ఆ పోస్టులో రష్మీ రాసుకొచ్చింది.

ఈ నేపథ్యంలో డిజిటల్‌ డిటాక్స్‌ అంటే ఏంటి అనే చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్‌ రన్‌ అవుతోంది. చాలా మంది వీడియోలు, సినిమాలు చూస్తూ చాటింగ్‌లతో ఫోన్‌తో మమేకం అయిపోతున్నారు. చుట్టూ ఏమవుతుందో కూడా తెలియకుండా గ్యాడ్జెట్స్‌కి బందీలవుతున్నారు. దీంతో వారంలో కొన్ని రోజులు ఫోన్‌కు దూరంగా ఉంటున్నారు. దీనిని ‘డిజిటల్‌ డీటాక్స్‌’ అని అంటున్నారు. ఇప్పుడు రష్మీ గౌతమ్‌ కూడా దీనినే ఫాలో అవుతోంది. మానసిక ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరం అని చెబుతున్నారు. మరి మీరు ఏమన్నా ఇది ట్రై చేస్తారా?

ప్లీజ్ దయచేసి సాయం చేయండి.. హీరోయిన్ వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus