ఓ హీరోయిన్ తన కెరీర్‌ను ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఈ ప్రశ్నకు రష్మిక మందన (Rashmika Mandanna) కెరీర్ చూపిస్తే ఓ మంచి ఆన్సర్ అవుతుంది. కన్నడ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక ఆ తర్వాత ఏకంగా నేషన్ క్రష్ అయిపోయింది. దాదాపు అన్ని అగ్ర సినీ పరిశ్రమల్లో ఆమె సినిమాలు చేసింది, చేస్తోంది కూడా. ఏంటి ఆమె కెరీర్ బిల్డింగ్ సీక్రెట్ ఏంటి అనే ప్రశ్న గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. దీనికి ఆన్సర్ ఆమెనే ఇచ్చింది. తన కెరీర్ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది.
సల్మాన్ ఖాన్‌తో (Salman Khan) నటించిన ‘సికందర్’ (Sikandar) సినిమా ప్రచారంలో భాగంగా రష్మిక మందన మీడియా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ను బిల్డ్ చేసుకున్న విధానం గురించి చెప్పుకొచ్చింది. కొత్త సవాళ్లను ఎప్పుడూ స్వీకరిస్తాను. మన కథల ఎంపికే మనల్ని స్టార్‌ను చేస్తుంది అని తాను ఓ పుస్తకంలో తాను చదివానని తన ఆలోచన విధానానికి స్ఫూర్తిని చెప్పుకొచ్చింది. ఇక వివిధ భాషల పరిశ్రమల్లో పనిచేయాలనుకోవడం తన ఛాయిస్ అని తెలిపింది.
కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇప్పటికే నటించిన రష్మిక.. త్వరలో మలయాళంలోనూ నటించాలని ఉంది అనే తన ఆలోచనను బయటపెట్టింది. మాలీవుడ్‌లో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నా అని చెప్పింది. మరి ఎవరు అక్కడి నుండి ఆమెకు ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఇక ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలన్నీ తన సొంత నిర్ణయాలేనని, ఎవరి నుండి సూచనలు, సలహాలు తీసుకోలేదు అని చెప్పింది. నా జీవితం నాదే. ఈ నిర్ణయాల వల్ల రేపు ఏం జరిగినా పూర్తి బాధ్యత నాదే అని చెప్పింది.
మరి పరిశ్రమలో పోటీ సంగతేంటి అని అడిగితే.. పోటీ విషయం నేను పెద్దగా పట్టించుకోను. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు అని అంది. ఆమె మాటలు చూస్తుంటే పరిశ్రమలో పోటీ గురించి పట్టించుకోను.. నా కెరీర్ నాదే అని చెబుతోంది. ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule), ఛావా (Chhaava) విజయాలతో జోరు మీదున్న రష్మికకు ‘సికందర్’ హ్యాట్రిక్ ఇస్తుందో లేదో ఈ నెల 30న తేలిపోతుంది.