Rashmika: ఆ సినిమా రష్మికను అంత బాధపెట్టిందా?

లిప్‌ లాక్‌ సీన్‌ చూడటానికి చాలా బాగుంటుంది. మరి ఆ సీన్ చేసే హీరోహీరోయిన్ల పరిస్థితి ఏంటి? ఆ సీన్‌ వచ్చిన తర్వాత ట్రోలింగ్‌ మొదలైతే.. ఆ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. ఈ ప్రశ్నలకు రీసెంట్ టైమ్‌లో సమాధానం చెప్పాలంటే రష్మిక మందననే చెప్పాలి. ఎందుకంటే ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా సమయంలో రష్మిక ఇలాంటి సీన్‌తో వచ్చిన ట్రోల్స్‌, సూటిపోటి మాటలకు చాలా ఇబ్బందిపడిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడింది.

‘‘డియర్‌ కామ్రేడ్‌’ రిలీజ్ తర్వాతి రోజులను, అందులోని ముద్దు సీన్‌పై వచ్చిన ట్రోల్స్‌ను ఎలా అధిగమించానో నాకే తెలియదు. మామూలుగానే నేను చాలా సున్నిత మనస్కురాలిని. ఆ సినిమా తర్వాత కొంతమంది ఫోన్‌ చేసి అంతా బాగానే ఉంది అని అనేవారు. కానీ కొందరు మాత్రం నన్ను ట్రోల్‌ చేశారు. ఆ సమయంలో నన్ను బాధించే ఘటనలు చాలానే జరిగాయి. రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చేదాన్ని. ఒక్కోసారి రాత్రంత్రా ఏడుస్తూనే ఉండేదాన్ని’’ అని చెప్పింది రష్మిక. ఎవరినో వేడుకుంటున్నట్లు కలలు వచ్చేవట రష్మికకు. తనను అందరూ నన్ను వెలివేసినట్లు కలలు వచ్చేవట.

రష్మిక మీద అప్పుడు అలాంటి ట్రోల్స్‌ ఎందుకు జరిగాయి అనేది ఓసారి చూస్తే.. అప్ప‌టికే ఆమె క‌న్న‌డ‌లో మంచి హిట్ కొట్టిన న‌టి, అందులోనూ రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యిది. అలా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత రష్మిక తెలుగులోకి వ‌చ్చి అలాంటి సీన్ల‌లో న‌టించ‌డం ఏంటి క‌న్న‌డ ప్రేక్ష‌కులు తెగ ట్రోల్‌ చేశారు. కొన్ని ఛానల్స్‌ అయితే ఆ రోజుల్లో ఈ విషయంలో డిబేట్‌లు కూడా పెట్టాయి అంటారు. సోషల్‌ మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ క్రమంలో కొంతమంది రష్మికను స్వార్థ‌ప‌రురాలిగా, భారీ పారితోషికాల‌కు ఆశ‌ప‌డే హీరోయిన్‌గా చూశారు. అందుకోసమే నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకుంది అని కూడా అన్నారు. దీంతో రష్మిక ఆ రోజుల్లో బాగా సఫర్‌ అయ్యింది అని చెబుతారు. అయితే ఆ చర్చలు, పరిణామాల తర్వాత ఆమె ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌ అవ్వడం గమనార్హం.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus