Rashmika: ఆ పాత్రను జీవితంలో మర్చిపోలేను!

నేషనల్ క్రష్ రష్మిక భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు తెలుగు తమిళ సినిమాలు మాత్రమే కాకుండా వరుస బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయిన రష్మిక ప్రస్తుతం పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం అనే సినిమాలో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఇండియాని ద్వేషించే పాకిస్తానీ అమ్మాయి అఫ్రీన్ పాత్రలో రష్మిక సందడి చేశారు.

ఇందులో రష్మిక పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి.ఈ సినిమా మంచి హిట్ అవడంతో తాజాగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.ఈ సినిమా కోసం చిత్ర బృందం మొత్తం రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డారని అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని తెలిపారు. ఇక ఈ సినిమాలో ఆఫ్రిన్ పాత్ర గురించి రష్మిక మాట్లాడుతూ.. ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని తన జీవితంలో నటించిన పాత్రలలో గుర్తుండిపోయే పాత్ర ఇదొకటి అంటూ ఈమె వెల్లడించారు.

ఇక సినిమాని డైరెక్టర్ హను రాఘవపూడి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఆయనకు మరెన్నో ఇలాంటి విజయాలు అందాలని ఈమె కోరుకున్నారు. ఇప్పటికే రష్మిక ఎన్నో విభిన్న పాత్రలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే తనకు బయోపిక్ చిత్రాలలోనూ అలాగే స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కి సినిమాలలో నటించాలని ఉందని

తన మనసులో కోరిక బయటపెట్టారు. ఇలాంటి సినిమా అవకాశాలు వస్తే అసలు వదులుకోనని ఈ సందర్భంగా రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus