రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ గతవారం రిలీజ్ అయ్యింది.సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. దీంతో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు మేకర్స్. దీనికి ప్రత్యేకంగా విజయ్ దేవరకొండని గెస్ట్ గా తీసుకొచ్చారు. రష్మిక- విజయ్.. ఒకే స్టేజిపై అంటే అందరి ఫోకస్ ఈ ఈవెంట్ పైనే ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఎందుకంటే వీళ్ళు చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ వాటిపై ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. అందుకే ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ ఈవెంట్లో ఏమైనా ఓపెన్ అవుతారేమో అని అంతా ఆతృతగా చూశారు. కానీ వాళ్ళు ఓపెన్ అవ్వలేదు. రష్మిక చేతిపై ముద్దు పెట్టడం..వంటి విజువల్స్ మాత్రం వాళ్ళని అభిమానించేవారికి కిక్ ఇచ్చాయి. అలాగే వీళ్ళ స్పీచ్..లు కూడా హైలెట్ అయ్యాయి.

విజయ్ మాట్లాడుతూ.. ‘ఈరోజే ది గర్ల్ ఫ్రెండ్ చూశాను. సినిమా నన్ను ఎంత ఇన్వాల్వ్ చేసింది అంటే.. కొన్ని చోట్ల చాలా ఎమోషనల్ అయ్యాను.’గీత గోవిందం’ లో ఆమె చిన్న పిల్ల..అప్పటి నుండి చూస్తున్నా. రష్మిక నిజంగానే భూమాదేవినే.సెట్లో అందరూ నవ్వుతూ, ఆనందంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. నన్ను ఎవడన్నా ఏమన్నా అంటే.. నేను రివర్స్ లో వెళ్తా. కానీ రష్మిక అలా కాదు.ఎవరెన్ని మాటలు అన్నా పడుతుంది.
తన వర్క్ తో వాటికి సమాధానం చెబుతుంది. మనమంతా తప్పులు చేస్తాం.. అమ్మాయిల విషయంలో..పార్ట్నర్ విషయంలో..! కానీ దర్శకుడు రాహుల్ రవీంద్ర మాత్రమే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.రష్మిక మాట్లాడుతూ.. “విజ్జు ‘ది గర్ల్ ఫ్రెండ్’ జర్నీ ప్రారంభం నుండి ఉన్నాడు. ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో ఒక విజయ్ దేవరకొండ ఉంటే బాగుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.
