Rashmika: హీరోలా బిహేవ్‌ చేసిన రష్మిక.. ఏం చేసిందంటే?

హీరోయిన్‌ కనిపించడం ఆలస్యం.. అక్కడి కెమెరా ఇంతేసి కళ్లు చేసుకొని క్లిక్‌ క్లిక్‌ అని శబ్దాలు చేసేస్తుంటాయి. ఆ హీరోయిన్‌ను తమ కెమెరాలో బంధించేస్తుంటాయి. అయితే అలా తీసిన ఫొటోలన్నింటిని ఏం చేస్తారు? ఈ డౌట్‌ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ వచ్చి ఉంటే.. మీకు తోడుగా క్రష్మిక అలియాస్‌ రష్మిక మందన కూడా వచ్చింద చేరింది. ఈ మధ్య ఓ షూటింగ్‌లో భాగంగా రష్మిక బయటకు వస్తే అక్కడ ఫొటో గ్రాఫర్‌లు కొంతమంది తెగ ఫొటోలు తీశారు. అప్పుడు రష్మిక అలా అడిగింది.

రష్మిక అలా వచ్చి క్యారవాన్‌లోకి వెళ్తుండగా ఫొటో గ్రాఫర్‌లు ఆపి ‘మేడమ్‌ ఫొటో ప్లీజ్‌’ అన్నారు. దీంతో నవ్వుతూ పోజులిచ్చింది రష్మిక. ఆ తర్వాత అలా నవ్వుతూనే.. ‘మీరు ఇన్నేసి ఫొటోలు తీసి, ఏం చేసుకుంటారసలు. ఈ విషయం చాలా రోజులుగా అడుగుదాం అనుకుంటున్నారు. ఏం చేస్తారో తెలుసుకోవాలని ఉంది’ అని అడిగింది. దీంతో అక్కడంతా నవ్వులు పూశాయి. రష్మిక సెన్పాఫ్‌ హ్యూమర్‌కి ఫ్యాన్స్‌ అయితే చూసి ముచ్చటపడిపోతున్నారు. అయితే ఇదంతా జరిగింది ముంబయిలో అని సమాచారం.

ఇక అదే సమయంలో అక్కడ మరో విషయం కూడా జరిగింది. మామూలుగా హీరోల దగ్గరకు ఫ్యాన్స్‌ వచ్చినప్పుడు పక్కనున్న అసిస్టెంట్‌లు, బాడీగార్డ్స్‌ పక్కకు నెట్టేస్తుంటారు. లేదంటే ఆపేస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది హీరోలు.. అతన్ని ఆపొద్దు వదిలేయండి ఫొటోనే కదా అని అంటుంటారు. ఆ పని ఇప్పుడు రష్మిక చేసింది. ఓ అభిమాని రష్మిక పక్కన నిల్చుని ఫొటోలు తీసుకునే ప్రయత్నం చేస్తే పక్కనే ఉన్న బాడీగార్డు ఆ కుర్రాడిని లాగేసే ప్రయత్నం చేశాడు.

కానీ, రష్మిక చాలా మంది హీరోయిన్లలా ఊరుకోలేదు. ఆ కుర్రాడు ఫొటో దిగనివ్వండి అని బాడీగార్డ్‌కి చెప్పింది. దీంతో అతడు ఫొటో దిగి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో రష్మిక ఇందుకే క్రష్మిక అయ్యింది అని ఆమె ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో ఓసారి చూసేయండి మరి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus