Rashmika: అందుకే నా అభిప్రాయాలు తప్పుగా వెళ్తున్నాయి: రష్మిక

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ఇప్పుడు తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె ఏం మాట్లాడుతున్నా.. అది జనాల్లోకి తప్పుగానే వెళ్తోంది. ‘కాంతారా’ సినిమా రిలీజ్ సమయంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలానే ఒక ఇంటర్వ్యూలో తన ఫస్ట్ డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా యాటిట్యూడ్ చూపించింది.

ఈ విషయంలో ఆమెని బాగా ట్రోల్ చేశారు. ఇక రీసెంట్ గా సౌత్ సినిమా రొమాంటిక్ సాంగ్స్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. ఇవన్నీ కలిపి రష్మికపై జనాల్లో ఒక నెగెటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నాయి. ఈ విషయంలో రష్మిక బాధ పడుతోంది. కొందరు కావాలనే తన మాటలను వక్రీకరిస్తున్నారని చెబుతోంది. అలానే కొన్ని మీడియా సంస్థలు తనని తప్పుగా చూపిస్తున్నాయనేది రష్మిక ప్రధాన ఆరోపణ.

బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ బాగుంటాయని చెప్పే క్రమంలో సౌత్ ఇండియన్ సినిమాల్లో ఐటెం సాంగ్స్, మాస్ పాటలు తప్ప రొమాంటిక్స్ సాంగ్స్ ఉండవన్నట్లుగా మాట్లాడింది రష్మిక. దక్షిణాది చిత్ర పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని ఆమెపై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో రష్మిక నేరుగా ఈ ట్రోలింగ్ పై స్పందించింది.

తను చెప్పింది ఎవరూ పూర్తిగా వినడం లేదని.. తన మాటలను మధ్యలోనే కట్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారని.. అందుకే తన అభిప్రాయాలు తప్పుగా వెళ్తున్నాయని రష్మిక తెలిపింది. ఇప్పుడామె అన్ని భాషల్లో బిజీగా ఉండడం వలన కొందరు కావాలనే ఇలా ఆమెపై నెగెటివిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు రష్మిక ఫ్యాన్స్. ఏది ఏమైనా.. రష్మిక ఈ సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం, ట్రోలింగ్ ని ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus