Rashmika: లైగర్ సినిమా నచ్చింది.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ ఆగస్టు 25 న రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోకే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ భారీగా నష్టపోయారు. హిందీలో మాత్రం ఈ మూవీ బాగానే ఆడింది. నార్త్ జనాలు ఈ మూవీని బాగానే ఆదరించారు.మైక్ టైసన్ ఈ మూవీలో గెస్ట్ రోల్ చేశాడు.

రిలీజ్ కు ముందు ఈ పాత్ర గురించి భారీగా ఎక్స్పెక్ట్ చేశారు కానీ.. సినిమాలో ఈ మూవీ చాలా కామెడీ గా ఉందని ప్రేక్షకులు పెదవి విరిచారు. అంతేకాదు సినిమాలో పాటల ప్లేస్మెంట్ కూడా బాగోలేదు అని విమర్శించారు. ఇదిలా ఉండగా… తాజాగా ఈ చిత్రం పై రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రష్మిక ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ” లైగర్ సినిమా నాకు బాగా నచ్చింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో నాకు విజయ్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.

అలా అని కాదు కానీ.. నాకు మాస్ మూవీస్ అంటే బాగా ఇష్టం. అందుకే లైగర్ నచ్చింది.ఈ మూవీ చూస్తున్నప్పుడు నేను విజిల్స్ వేశాను, డాన్స్ చేశాను. సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు. నాకు సినిమా నచ్చింది. విజయ్ అదరగొట్టేశాడు. ” అంటూ గుడ్ బై సినిమా ప్రమోషన్లలో భాగంగా చెప్పుకొచ్చింది మన నేషనల్ క్రష్.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus