Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఎలాంటి హీరోయిన్ కెరీర్ అయినా టర్న్ అవుతుంది. హీరోయిన్ రేంజ్ పెరిగేది కూడా స్టార్ హీరో ఛర్మిష్మా వల్లనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే హీరోయిన్లు స్టార్ హీరోలపై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. ఈ లిస్టులో రష్మిక మందన్న కచ్చితంగా ముందుంటుంది అనే చెప్పాలి.ఎందుకంటే కెరీర్ ప్రారంభంలో ఈమె విజయ్ దేవరకొండ వంటి అప్ కమింగ్ హీరోల సినిమాల్లోనే నటించింది. అయితే మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ వల్ల ఈమె రేంజ్ మారిపోయింది.

Rashmika

రష్మికకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో మహేష్ బాబే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే రష్మికకి ‘పుష్ప’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది. అటు తర్వాత కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ సల్మాన్ ఖాన్ సరసన కూడా నటించడానికి ఈమె వెనుకాడలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. రష్మిక ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన రష్మికకి.. ‘ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందా?’ అంటూ ఎదురైన ప్రశ్నకి ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచన నాకు ఎక్కువగానే ఉంది. ఆయన అంత మంచి మనిషిని, మంచి నటుడిని నేను చూడలేదు. అతనితో పనిచేయడం వల్ల కచ్చితంగా నా కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనే నమ్మకం నాకు ఉంది’ అంటూ సమాధానం ఇచ్చింది రష్మిక. అయితే ప్రభాస్- రష్మిక..కాంబోని సెట్ చేసే దర్శకుడు ఎవరో చూడాలి.

 

పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus