Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక ఆ విషయంలో గ్రేట్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతుండగా తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో సైతం రష్మిక వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. సినిమా సినిమాకు రష్మిక రేంజ్ పెరుగుతుండగా రష్మిక వరుస సినిమాలతో బిజీ కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీకి ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా ఎయిర్ పోర్ట్ లో రష్మికకు ఒక చిన్నారి ముద్దు పెట్టింది.

ఊహించని ఈ ఘటనకు రష్మిక మొదట షాకైనా ఆ తర్వాత అభిమాని చూపించిన అభిమానానికి ఫిదా అయ్యారు. మొదట రష్మిక బుగ్గలను గిల్లిన ఆ చిన్నారి ఆ తర్వాత రష్మికకు ముద్దు పెట్టారు. ఆ తర్వాత రష్మిక కళ్లు మూసుకుని సిగ్గు పడ్డారు. అయితే ఫ్యాన్ ఇలా చేస్తున్నా ప్రేమగా వ్యవహరించిన రష్మిక గ్రేట్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చిన్నారి రష్మిక బుగ్గ గిల్లిన ఫోటోలు, వీడియోలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రష్మిక (Rashmika) రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే రష్మికకు తిరుగుండదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ పరంగా మరింత ఎదిగే దిశగా రష్మిక అడుగులు వేయాలని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యానిమల్ సినిమా నిడివి మూడున్నర గంటలు అని ఈ సినిమాకు రెండు ఇంటర్వెల్స్ ఉన్నాయని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రష్మిక సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. రష్మిక రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది. రష్మిక తెలుగులోని మరి కొందరు స్టార్ హీరోలకు సైతం జోడీగా నటిస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు. ఎక్కువ సంఖ్యలో సినిమాలకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిసున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus