Rashmika: నా విజయానికి కారణం వాళ్లే… రష్మిక కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయి ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రష్మిక మందన్న ఒకరు. ఈమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుని వివిధ భాషలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన ఆరు సంవత్సరాల కాలంలో ఈమె తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె నటించిన వారసుడు సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలై ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన మిషన్ మజ్ను సినిమా కూడా ఈ నెల 20 వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ల కోసం ఈమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ… ఇండస్ట్రీలో నాకన్నా ఎంతో అందమైన టాలెంట్ కలిగినటువంటి హీరోయిన్ లు ఉన్నారు. అయితే వారిని కాదని నాకు ఇలా అన్ని భాషలలో అవకాశాలు రావడం నిజంగా నా అదృష్టం.

తన ప్రేమకు తోడు దర్శక నిర్మాతలు సహకారం ప్రేక్షకుల అభిమానం అన్నింటికీ మించి ఆ దేవుడు ఆశీస్సులతో తనకు ఇన్ని విజయాలు వరించాయని ఈమె వెల్లడించారు. తాను ఎల్లప్పుడూ ఇతరుల సమయాన్ని వారి నిర్ణయాలను గౌరవిస్తానని,ఒక నటిగా నిత్యం తాను ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఆరాటపడుతుంటానని తెలిపారు.

ముఖ్యంగా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకోవడం కోసం తాను ప్రయత్నాలు చేస్తూ ఉంటానని తెలిపారు. ఇక తనకు నటుడు విజయ్ అంటే ఎంతో అభిమానం ఇలా తన అభిమాన నటుడితో కలిసి నటించే అవకాశం రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని రష్మిక తెలిపారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus