Rashmika: ఆ హీరో కోసం దేవుడు తన సమయం కేటాయించి ఉంటారు: రష్మిక

రష్మిక మందన్న భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా పుష్ప 2 సినిమా షూటింగ్లో పాల్గొన్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇన్ని రోజులు ఈమె బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందని తాను పుష్ప 2 షూటింగ్లో పాల్గొనబోతున్నానంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అలాగే ఈ సినిమాలో హీరోగా నటించిన రణబీర్ కపూర్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. రణబీర్ కపూర్ గురించి రష్మిక మాట్లాడుతూ ఆయన చాలా గ్రేట్ పర్సన్ అని, ఎంతో స్పెషల్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ప్రత్యేకంగా సమయం కేటాయించి తనని ఇలా తయారు చేశారు అంటూ ఈమె బాలీవుడ్ హీరో పై ప్రశంసలు కురిపించారు.

ఈ విధంగా (Rashmika) రష్మిక మందన్న ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా మొదటిసారి ఈ హీరో పై ఇంతగా ప్రశంసలు కురిపించడంతో పెద్ద ఎత్తున ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటువంటి పలువురు నేటిజన్స్ రణబీర్ కపూర్ ను అంతగా పొగడాల్సిన అవసరం ఏమాత్రం లేదని భావిస్తున్నారు. ఇక ఈమె ఈ సినిమాతో పాటు రెయిన్ బో అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అదేవిధంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ తో కలిసి మరో సినిమా కూడా చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస భాష సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ఈమె చివరిగా హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా ద్వారా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus