Rashmika: రష్మిక మందన మేనేజర్ వ్యవహారం పై క్లారిటీ

  • June 23, 2023 / 12:43 PM IST

స్టార్ హీరోలు లేదా హీరోయిన్ల కెరీర్ విషయంలో మేనేజర్ల నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. మేనేజర్ కనుక సరిగ్గా లేడు అంటే.. వీళ్ళ కెరీర్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మేనేజర్ లు.. హీరో, హీరోయిన్లను ముంచేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్ , మొన్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు రష్మిక. రెండు రోజులుగా రష్మికకి అతని మేనేజర్ హ్యాండిచ్చాడు అంటూ ఏంటేంటో ప్రచారం జరుగుతుంది.

‘ఛలో’ నుండి (Rashmika) రష్మికకి మేనేజర్ గా చేస్తున్న ఓ వ్యక్తి ఆమెకు రూ. 80 లక్షలు టోకరా వేసినట్టు.. ఈ విషయం తెలుసుకుని రష్మిక అతన్ని తీసేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని.. తాజాగా రష్మిక, అలాగే ఆమె పాత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ‘ఆరోగ్యకరమైన వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం.

ఇప్పుడు కూడా అంతే హుందాగా విడిగా పని చేయాలని డిసైడ్ అయ్యాం’ అని రష్మిక, అలాగే ఆమె మేనేజర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టైంది. ఇక రష్మిక .. ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ , నితిన్ – వెంకీ కుడుముల ప్రాజెక్టులో, ‘రెయిన్ బో’ అనే తమిళ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus