తన విజయ రహస్యాన్ని చెప్పుకొచ్చిన రష్మిక మందన్న
- February 18, 2020 / 12:50 PM ISTByFilmy Focus
ప్రెజంట్ జనరేషన్ హీరోయిన్లలో మోస్ట్ వాంటెడ్ అంటే పూజా హెగ్డే తర్వాత అందరికీ ఇమ్మీడియట్ గా గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. వరుస విజయాలతోపాటు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటున్న రష్మికను చూసి నవతరం నాయికలందరూ కుళ్లుకుంటున్నారు. అయితే.. తాను ఇలా వరుసబెట్టి విజయాలను అందుకోవడం వెనుక కానీ, స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోవడానికి కారణం బ్యాడ్ స్క్రిప్త్స్ ను నిస్సంకోచంగా రిజెక్ట్ చేయడమే అని చెబుతోంది రష్మిక మందన్న.

“డియర్ కామ్రేడ్” అనంతరం దాదాపు 50 కథలు, ఆఫర్లు రిజెక్ట్ చేసిందట రష్మిక. అందుకు కారణం తన క్యారెక్టర్ లేదా కథ నచ్చకపోవడమే. ఆ సినిమాలు ఏమిటి? వాటి రిజల్ట్ ఏమైంది? అనేది నేను చెప్పను కానీ.. వాటిలో ఏ ఒక్క సినిమా వదులుకొన్నందుకు తాను బాధపడాల్సిన అవసరం మాత్రం తనకు రాలేదని చెబుతోంది రష్మిక. మరి అమ్మడికి ఉన్న ఈ క్లారిటీ మిగతా హీరోయిన్స్ కు కూడా ఉంటే బాగుండేది. ఇకపోతే.. ఆమె తాజా చిత్రం “భీష్మ” ఈ శుక్రవారం విడుదలవుతోంది.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!













