టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్ గురయ్యే నటీమణుల జాబితా తీస్తే.. తొలి స్థానంలో నిలిచే హీరోయిన్ రష్మిక మందన అని చెప్పొచ్చు. తొలి సినిమాల విషయంలో పెద్దగా ఏమీ ట్రోలింగ్ కనిపించలేదు కానీ.. ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తూ.. నాటి విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఆమెను ఇరిటేట్ చేస్తున్నారు ట్రోలర్స్ అంటూ ముద్దు పేరు పెట్టుకున్న స్వయం ప్రకటిత క్రిటిక్స్. రష్మిక మందన ఏం చేసినా తప్పే అనేలా ఉంటాయి వారి మాటలు. దీంతో రోజూ తనకో యుద్ధం అని అంటోంది.
జీవితంలో ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి. కథానాయికగా చిత్రీసీమలోకి అడుగు పెట్టడానికి ముందు ఒక రకమైన యుద్ధం చేస్తే.. వచ్చాక మరో రకమైన యుద్ధం చేయాల్సి వస్తుంది అంటూ హీరోయిన్ లైఫ్ గురించి వివరించింది రష్మిక మందన. ఇండస్ట్రీలోకి రావడానికి ముందు ఎక్కువ పోరాడాల్సి వచ్చిందా.. హీరోయిన్ అయ్యాక ఎక్కువ పోరాటం చేస్తున్నారా? అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం అది. నటిగా సినిమాల్లోకి రావాలంటే ఇంట్లో వాళ్లతో ముందు పోరాడాలి అని చెప్పింది.
సినిమా రంగంలో నేను రాణించగలను.. ఆ సత్తా నాకు ఉందని వాళ్లని నమ్మించగలగాలి.. పోరాటం అక్కడితో షురూ అవుతుంది. కొన్ని సినిమాలు చేసి, నటిగా నిరూపించుకున్నాక మరో రకమైన పోరాటం చేయాల్సి వస్తుంది. ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి అనే ఆలోచలు మొదలవుతాయి. ఆ తర్వాత వరుస అవకాశాల సమయంలో టైమ్‌తో ఎలా పోటీ పడాలి, కుటుంబానికి సమయం ఎలా కేటాయించాలి లాంటి ఆలోచనలు మొదలవుతాయి.
అంతేకాదు జీవితంలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, చర్చలు, యుద్ధాలు ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తేనే జీవితం. లేదంటే ఎక్కడికక్కడే ఉండిపోతుంది అని తన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పింది రష్మిక మందన. ఆ మాటకొస్తే చాలామంది నాయికల జీవితం ఇలానే ఉంటుంది. రష్మిక మందన చెప్పింది మిగిలిన వాళ్లు మనసులో దాచుకుని ఉంటారు. వాళ్లు కూడా ఓ సందర్భం వస్తే చెబుతారు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!