Rashmika: రష్మిక ఆశలపై నీళ్లు చల్లారే!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు ‘పుష్ప’ సినిమాతో నార్త్ లో కూడా ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఆమెకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. సౌత్ లో ఎంత క్రేజ్ వచ్చినా.. మన హీరోయిన్లకు బాలీవుడ్ లో కూడా రాణించాలనే కోరిక ఉంటుంది. కానీ సక్సెస్ అయినవాళ్లు మాత్రం కొందరే. బాలీవుడ్ అవకాశాలు అనగానే రష్మిక కూడా చాలా సంబరపడింది. ఎంతో ఎనర్జీతో అక్కడ సినిమాలు చేస్తుంది.

మొదటి సినిమా అమితాబ్ తో చేసిన ‘గుడ్ బై’ నిరాశ పరిచింది. ఇప్పుడు ఆమె నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1970 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించింది రష్మిక. ఈ సినిమాలో రష్మిక పాకిస్థాన్ అమ్మాయిగా నటించింది. ఈ సినిమాను నేరుగా థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనుకోకుండా ఓటీటీలో నేరుగా రిలీజ్ చేస్తున్నారు.

రష్మిక బాలీవుడ్ ఆశలపై ఈ రెండు సినిమాలు నీళ్లు చల్లాయనే చెప్పాలి. తన టాలెంట్ తో నార్త్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయాలనుకున్న రష్మికకు మొదటి రెండు సినిమాలు ఓటీటీ రిలీజ్ ఎంచుకొని ఆమెకి షాకిచ్చాయి. మరోపక్క తెలుగు, తమిళ భాషల్లో ఇప్పుడు ఆమెకి అవకాశాలు లేవు. ‘వారసుడు’ తరువాత తమిళంలో ఆమె మరో సినిమా సైన్ చేయలేదు. తెలుగులో ఆమె చేతిలో ‘పుష్ప2’ సినిమా మాత్రమే ఉంది.

ఇది వరకు ఇలానే సౌత్ ఇండస్ట్రీని లైట్ తీసుకొని బాలీవుడ్ కి వెళ్లిన భామలకు అక్కడ అవకాశాలు రాక.. తెలుగులో ఛాన్స్ లు ఇవ్వక వారి కెరీర్ అటకెక్కింది. రష్మిక అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడితే మంచిది. ‘పుష్ప2’ తరువాత ఆమెకి మళ్లీ నార్త్ లో అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే ఆమె ఎలాంటి సినిమా సైన్ చేయలేదు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus