VNR Trio: అఫీషియల్‌: ‘భీష్మ’ కాంబో రిపీట్‌ నుండి ఒకరు ఔట్‌… హీరో మాటల్లోనే…

VNRTrio.. ఈ మాట ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా? నితిన్‌ – రష్మిక సినిమాలను ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు బాగా సుపరిచితం కూడా. ‘భీష్మ’ సినిమా కాంబోను రిపీట్‌ చేస్తున్నాం అంటూ వెంకీ కుడుముల, నితిన్‌, రష్మిక కలసి ఓ వీడియో చేసి మరీ ఆ సినిమాను అనౌన్స్‌ చేశారు. అయితే ఇప్పుడు దాని పేరు VNSగా మారిపోయింది. ఈ విషయాన్ని నితినే చెప్పాడు. ‘ఎక్స్‌ట్రా’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ విషయం బయటకు వచ్చింది. ఆ సినిమా హీరోయిన్‌నే తర్వాతి సినిమాకు నితిన్‌ తీసుకున్నాడు. అదీ అసలు విషయం.

నితిన్‌ – రష్మిక కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ విషయాన్నిచెబుతూ ఆ తర్వాత అందులోని ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల పరిస్థితిని చెబుతూ ఓ వీడియోను చేసి సినిమాను అనౌన్స్‌ చేసింది టీమ్‌. అందులో భాగంగా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఈ క్రమంలో రష్మిక గురించి నితిన్‌ కౌంటర్‌ వేస్తూ ‘మన డైరక్టర్‌ కథ రాసేటప్పుడు ముందు నీ పేరు రాశాకనే కథ మొదలుపెడతాడు’ అని కౌంటర్‌ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆమెనే కథలో లేకుండా పోయింది.

దీంతో అప్పటి వీడియో బిట్‌ను కట్‌ చేసి… కొంతమంది టీమ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అయితే వరుస సినిమాల కారణంగా ఆమె సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది అని నితిన్‌ చెప్పాడు. అంతేకాదు ఈ క్రమంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందని నితిన్ అన్నాడు. చాలామంది హీరోయిన్లు బాలీవుడ్‌కి వెళ్లడంపై దృష్టి సారిస్తున్నారని, అందుకే తెలుగు సినిమాల్లో హీరోయిన్ల లేమి కనిపిస్తోందని కామెంట్‌ చేశాడు.

ఇక వెంకీ కుడుముల సినిమా గురించి చెబుతూ… రష్మిక సినిమా నుండి తప్పుకున్నాక ఆ పాత్రకు శ్రీలీల అయితే బాగుంటుందని దర్శకుడు సూచించారట. దీంతో ఆమెనే తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప 2’తోపాటు ‘రెయిన్ బో’ అనే మరో సినిమాలో నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమా కూడా చేస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus