Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

‘యానిమల్’ 900 కోట్లు, ‘పుష్ప 2’ 2000 కోట్లు, హిందీలో ‘చావా’ 700 కోట్లు, ధనుష్‌తో ‘కుబేర’ బిగ్ హిట్.. ఇలా గత కొంతకాలంగా రష్మిక మందన్నా ముట్టిందల్లా పాన్ ఇండియా బంగారమే అవుతోంది. వేల కోట్ల బిజినెస్ చేస్తున్న ప్రాజెక్టులలో భాగమవుతూ, ఆమె ‘గోల్డెన్ గర్ల్’ ట్యాగ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలాంటి స్టార్‌డమ్ పీక్స్‌లో ఉన్న రష్మికకు, ఇప్పుడు ‘థామా’ రూపంలో ఊహించని షాక్ తగిలింది.

Rashmika Mandanna

దీపావళికి విడుదలైన ఆమె లేటెస్ట్ హిందీ చిత్రం ‘థామా’, తెలుగు రాష్ట్రాల్లో కనీస ఆదరణకు కూడా నోచుకోలేదు. ‘నేషనల్ క్రష్’గా, ‘శ్రీవల్లి’గా దేశాన్ని ఊపేస్తున్న హీరోయిన్ సినిమా ఇది అని తెలిసినా, ప్రేక్షకులు థియేటర్ల వైపు కన్నెత్తి చూడలేదు. ఆమె స్టార్‌డమ్, సినిమాకు జీరో ఇంపాక్ట్‌ను ఇచ్చింది. ఇది చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.

వసూళ్ల లెక్కలు చూస్తే మరింత షాకింగ్‌గా ఉన్నాయి. ‘థామా’ సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది కేవలం 35 లక్షల గ్రాస్ మాత్రమే. 2000 కోట్ల సినిమా బ్రాండ్‌లో ఉన్న హీరోయిన్‌కు, ఇది చాలా పెద్ద డిజాస్టర్ నంబర్. కనీసం ప్రమోషన్లు అయినా చేసి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదేమో.

నిజానికి, మ్యాడాక్ బ్యానర్ హారర్-కామెడీలకు మంచి పేరే ఉంది. కానీ, రష్మిక క్రేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. అసలు ప్రమోషన్లే చేయకపోవడం, దీపావళికి ఇతర సినిమాల పోటీ ఉండటం దీనికి కారణాలుగా చెబుతున్నారు. అయినా, రష్మిక రేంజ్ స్టార్‌డమ్ ఉన్నప్పుడు, సినిమాకు కనీస ఓపెనింగ్స్ అయినా రావాలి కదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

థామాడిజాస్టర్ రష్మికకు ఒక పెద్ద వేక్ అప్ కాల్ లాంటిది. ‘పాన్ ఇండియా స్టార్ట్యాగ్ ఉన్నంత మాత్రాన, కంటెంట్ లేని, ప్రమోషన్లు చేయని సినిమాలను ప్రేక్షకులు ఆదరించరని ఇది స్పష్టం చేస్తోంది. వేల కోట్ల ప్రాజెక్టులు చేస్తున్న హీరోయిన్, ఇలాంటి చిన్న సినిమాతో ఇంత పెద్ద ఫ్లాప్ చూడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus