Rashmika: ట్రోలర్స్‌కి మరో స్టఫ్‌ ఇచ్చిన రష్మిక.. ఎలా రియాక్ట్‌ అవుతారో?

శాండిల్‌ వుడ్‌లో రక్షిత్‌ శెట్టి – రిషబ్‌ శెట్టి – రష్మిక మందన కాన్సెప్ట్‌లో కొత్త అప్‌డేట్ వచ్చింది. గత కొన్ని రోజులుగా వీరి మధ్యలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరూ డైరెక్ట్‌గా అనుకోవడం లేదు కానీ.. ఇన్‌డైరక్ట్‌గా ఒకరి మీద ఒకరు కామెంట్స్‌ చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా రష్మిక మందన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టివల్లే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలిగానని, తన ప్రజెంట్‌ స్టేటస్‌కి వాళ్లూ ఓ కారణమని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు నేను నటిగా ఇన్ని భాషల్లో పనిచేస్తున్నందుకు, ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆనందిస్తున్నా. నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను చాలామంది నటీనటులతో కలిసి పనిచేశాను. అయితే నటిగా నేను పరిశ్రమలోకి రావడానికి రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టినే కారణం. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో వాళ్లే దారి చూపించారు అని రష్మిక చెప్పుకొచ్చింది. సాధారణంగా నేను మౌనంగా ఉంటాను. మొదట్లో నాపై ఎన్ని ట్రోలింగ్స్‌ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తొలుత వాళ్లు నా గురించి కామెంట్‌ చేశారు కానీ.. విమర్శించలేదు. కానీ ఇప్పుడు ఆ కామెంట్స్‌ శ్రుతి మించుతున్నాయి.

నాపై వస్తున్న ట్రోల్స్‌ నన్నే కాదు.. మొత్తంగా నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ట్రోల్స్‌ను ఇప్పుడు నేను అంగీకరించలేకపోతున్నా. నేను పరిశ్రమలో ఉండటం ఎంత ముఖ్యమో… నా సోదరి మానసిక ఆరోగ్యం కాపాడటమూ అంతే ముఖ్యం అని చెప్పుకొచ్చింది. గతంలో ఓ సందర్భంలో ‘కిరిక్‌ పార్టీ’తో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన ‘పరంవా’ బ్యానర్‌ పేరు చెప్పడానికి రష్మిక ఆసక్తి కనబర్చలేదు. రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఆ సినిమాకు రిషబ్‌ దర్శకత్వం వహించారు.

దీంతో ఇండస్ట్రీలో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన బ్యానర్‌ పేరు చెప్పకపోవడం ఏంటి.. అంటూ రష్మికను కామెంట్‌ చేశారు. అయితే ఆమె పేరు చెప్పకపోవడానికి గతంలో రక్షిత్‌తో ఆమెకున్న బంధం కారణం అని తెలిసినా కూడా కామెంట్స్‌ వచ్చాయి. ‘కాంతార’ సినిమా చూడలేదు అని కూడా రష్మిక అనడంతో ఆ కామెంట్స్‌ వేడెక్కాయి. దీంతో ఆ డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం గత కొన్ని రోజులుగా రష్మిక ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రక్షిత్‌, రిషబ్‌ను ఆకాశానికెత్తడం కూడా అందులో భాగమే అంటూ మళ్లీ కామెంట్స్‌ వస్తున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus