Rashmika Mandanna: టెక్నాలజీని మిస్ యూజ్ చేస్తున్నారు.. రష్మిక ఎమోషనల్ కామెంట్స్ వైరల్

స్టార్ హీరోయిన్ రష్మిక మందనకి సంబంధించిన ఓ ఫేక్ వీడియో గత కొన్ని గంటలుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అస్లీలత కనిపించింది. హీరోయిన్లు అన్నాక గ్లామర్ ఫోటో షూట్లు చేస్తుంటారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రష్మిక కూడా అలా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వీడియో సంగతి వేరు. ఎందుకంటే ఇందులో ఉన్నది రష్మిక కాదు.

ఇది ఒక మార్ఫింగ్. టెక్నాలజీని వాడి ఈ వీడియోకి రష్మిక ఫేస్ తగిలించారు. ఈ విషయాన్ని ఓ నెటిజెన్ బయటపెట్టాడు. ‘‘ఈ వీడియోలో ఉన్న అసలు వ్యక్తి పేరు జారా పాటెల్‌. ఆమె ఓ బ్రిటీష్‌-ఇండియన్‌. అక్టోబర్‌ 9న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఆమెకు నాలుగు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు” అంటూ అసలు విషయాన్ని తెలిపాడు. దీనిపై అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు కూడా ఫైర్ అవుతున్నారు.

ఇక ఆ ఫేక్ వీడియో పై రష్మిక (Rashmika) స్పందిస్తూ.. “నిజాయితీగా చెప్పాలంటే ఇది నాలో లేని పోని భయాన్ని రేపింది అని చెప్పాలి. నాకే కాదు, మనలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దారుణమైన పరిస్థితి రావచ్చు. టెక్నాలజీని తప్పుగా వాడటమే దానికి కారణం. ఈరోజు నేను ఓ మహిళగా ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొని నిలబడ్డాను అంటే నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఉండటం వల్లనే.

వాళ్ళే నాకు అండ. ఇలాంటి పరిస్థితే నేను స్కూల్లోనో, కాలేజీలోనో చదువుకుంటున్నప్పుడు వచ్చి ఉంటే.. నేను ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉండేదాన్నా? అనే భయం వేస్తుంది” అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus