Rashmika: సినిమా ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది.. వాటిని పెద్దగా పట్టించుకోను?

సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి ఊహించని విధంగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఊహించన విధంగా ఇండస్ట్రీలో స్టార్డం సంపాదించుకున్న రష్మిక గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల రూమర్స్ వినపడుతూ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రష్మికకు సంబంధించిన ఇలాంటి రూమర్స్ నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు తాను ఏ విధంగా స్పందిస్తారు వాటిని ఎలా తీసుకుంటారనే ప్రశ్న తనకు ఎదురయింది.

తాజాగా ఈమె సీతారామం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనగా తనకు ఇలాంటి ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ తనకు సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఇచ్చింది. సరైన గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు అభిమానుల ప్రేమ ఇలా ఎన్నో తనకు సినిమా ఇండస్ట్రీ ఇచ్చిందని, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇవన్నీ తనకు దక్కవని రష్మిక వెల్లడించారు.తనకన్నా ఇండస్ట్రీకి ఎంతోమంది ముందు వచ్చారు వారిని కాదని ఇలాంటి అవకాశాలు నాకు వస్తున్నాయంటే అది అదృష్టమని చెప్పాలనీ ఈమె తెలిపారు.

ఇలా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు అదృష్టం వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యల గురించి తాను పట్టించుకోనని, తన గురించి వచ్చే గాసిప్స్ రూమర్స్ గురించి తాను ఎప్పుడు ఆలోచించనని ఈమె తెలిపారు. ఇలా వాటి గురించి మాట్లాడటం వల్ల కొందరు సంతోషం వేస్తుంది అంటే అంతకన్నా కావాల్సింది ఏముంది అంటూ తన గురించి వచ్చే రూమర్స్ పై రష్మిక తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus