క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మిక.. కన్ఫర్మ్ అయినట్లే!

గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చే నెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా చాలా మంది హీరోయిన్లను పరిశీలించారు. ఫైనల్ గా రష్మికను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా రష్మిక తన టీమ్ తో కలిసి త్రివిక్రమ్ ను కలిసింది.

ఆయనతో సమావేశమై బయటకి వస్తుండగా.. కెమెరాలకు చిక్కింది. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి సంబంధించి కథా చర్చల కోసమే ఆమె త్రివిక్రమ్ ను కలిసినట్లు తెలుస్తోంది. స్టోరీతో పాటు రష్మిక పాత్ర ఎలా వుండబోతుందనే విషయంపై త్రివిక్రమ్ నేరేషన్ ఇచ్చినట్లు టాక్. దీన్ని బట్టి చూస్తుంటే.. ఎన్టీఆర్ సరసన రష్మిక నటించడం ఖాయమని తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో రాబోయే తొలి సినిమా ఇదే. అలానే ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉందట.

దానికోసం ఒకప్పటి నటి ‘నిరీక్షణ’ ఫేమ్ అర్చనను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో హీరోయిన్ గా నటించిన అర్చన.. నటిగా జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. అయితే చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. రీసెంట్ గా ‘అలీతో సరదాగా’ షోలో కనిపించి.. సరైన అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నాడు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus