Rashmika Mandanna: రష్మిక క్రేజ్ మామూలుగా లేదుగా!

సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పుడు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను వాడుతూ ఉంటారు. శూస్, వాచ్, దుస్తులు, కార్లు అన్ని వారి స్థాయికి తగ్గట్టు చాలా ఖరీదైనవి వాడుతుంటారు. ఇటీవల బింబిసారా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన టీ షర్ట్ వైరల్ గా మారింది ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన టీ షర్టు ధర దాదాపు 24 వేల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక కూడా లక్షలు విలువ చేసే ఖరీదైన టీషర్ట్ ని ధరించింది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక బాలీవుడ్ లో కూడా బడా హీరోలతో నటించే అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు నేషనల్ వైడ్ గుర్తింపు పొందింది. ఇంతటి పాపులారిటీ ఉన్న రష్మిక తన స్థాయికి తగ్గట్టు ఖరీదైన వస్తువులను వినియోగిస్తుంది. ఇటీవల సిద్దార్థ్ రాయ్ కపూర్ కార్యాలయంలో సందడి చేసిన రష్మిక ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ సమయంలో రష్మిక రూ. 1.26,440 ఖరీదు చేసే గూచీ స్వెట్టర్ ధరించింది. ఈ ఫోటోలలో రష్మిక బ్లాక్ ఫార్మల్ ప్యాంట్.. వైట్ స్వెట్టర్ ధరించింది. రష్మిక ధరించిన స్వెటర్ ఖరీదు తెలిసిన నేటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం రష్మిక నటించిన ‘ సీతారామం ‘ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన ఈ సినిమాలో రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది.

అంతేకాకుండా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన వరిసు(వారసుడు) సినిమాలో కూడా నటిస్తోంది. మిస్టర్ మజ్ను, గుడ్ బై, యానిమల్ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా పుష్ప 2 సినిమాలో కూడా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు రెండవ వారం నుండి ప్రారంభించనున్నట్లు సమాచారం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus