Rashmika: కొత్త సినిమా కోసం రష్మిక ఎలా మారిందో చూశారా!

సౌత్‌లో సంపాదించిన పేరును, బాలీవుడ్‌లోనూ సంపాదించాలని చూస్తోంది రష్మిక మందన. ఈ క్రమంలో వరుస అవకాశాలు అయితే సంపాదిస్తోంది కానీ.. వరుస విజయాలు అయితే రావడం లేదు. ఈ క్రమంలో కనీసం బాలీవుడ్‌ సినిమాతో ఓటీటీలో అయినా విజయం అందుకోవాలని చూస్తోంది. దీని కోసం పాకిస్థానీ అమ్మాయిగా మారిపోయింది. సిద్థార్థ్ మల్హోత్రాతో రష్మిక మందన జత కట్టిన సినిమా ‘మిషన్ మజ్ను’. జనవరి 20న ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. మన దేశం మీద ఆటంబాంబు ప్రయోగించడానికి పాకిస్థాన్ చేసే ప్రయత్నాలను అడ్డుకునే గూఢచారి పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా కనిపిస్తున్నాడు. పాకిస్తాన్‌లో అక్కడివారితో కలిసి పోవడానికి తను పెళ్లి చేసుకునే పాకిస్థానీ యువతిగా రష్మిక మందన్న కనిపించనుంది. సిద్ధార్థ్ మిషన్‌కు RAW పెట్టిన పేరు ‘మిషన్ మజ్ను’. దాన్నే సినిమా టైటిల్‌గా పెట్టారు.

1970 నాటి ప్రేమకథతో ఈ సినిమాను రూపొందించారు. దేశభక్తి, ప్రేమ వంటి అంశాలతో సినిమాను రూపొందించారు.ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రా భారత గూఢచారి ఏజెంట్‌గా కనిపిస్తాడు. తొలుత ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. అయితే సినిమా చాలా సార్లు వాయిదా పడింది. దీంతో ఆఖరికి డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీకి ఇవ్వడంలో ఓ చర్చ ఉందంటున్నారు.

నార్త్ ఆడియన్స్‌లో అక్కడి కంటెంట్‌ విషయంలో అంతటి ఆసక్తి లేకపోవడంతోనే ఈ సినిమాను ఓటీటీకి ఇస్తున్నారని టాక్‌ వచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే.. గతంలో ఎక్కడో చూసినట్లుందే అనే ఫీలింగే వస్తోంది. దీంతో అప్పుడు వచ్చిన పుకార్లు నిజమే అనిపిస్తున్నాయి. మరి ఓటీటీలో సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ఈ సినిమా రష్మిక మందనకు ఎంత కీలకమో, సిద్ధార్థ్‌ మల్హోత్రాకూ అంతే కీలకం. సరైన విజయం సిద్ధార్థ్‌కు కూడా అవసరం.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus