టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఏం చేసినా ట్రోలర్ల మాటలు పడే కథానాయిక ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మందన అనే చెప్పాలి. ఆమె మాటలు, చేతలు, లుక్స్.. ఇలా అన్నీ ట్రోలర్స్‌ను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇంకేముంది బొమ్మలు, మాటలు, వీడియోలు.. ఇలా అన్ని రకాలుగా ఆమెను ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇన్నాళ్లూ ఈ విషయంలో చూసీ చూడనట్లు వదిలేసిన రష్మిక ఈ మధ్య కాలంలో రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది.
‘‘నేనేం చేసినా తప్పంటే ఎలా?’’ అంటూ ఓపెన్‌గానే ప్రశ్నించింది రష్మిక. తనను తరచుగా విమర్శించేవాళ్ల మీద రష్మిక ఏరేంజిలో కోపంగా ఉందంటే…‘ఆఖరికి నేనును గాలి పీల్చినా కూడా కొందరికి సమస్యే’’ అని కామెంట్ చేసేంత. సోషల్ మీడియాలో నా మీద ఉన్నంత నెగెటివిటీ ఇంకెవరి మీదా ఉండదేమో అని కామెంట్ చేసింది. నేను బాగా వర్కవుట్ చేసి ఫిట్‌గా ఉందామని ప్రయత్నిస్తే మగాడిలా ఉన్నావు అంటున్నారు. వర్కవుట్ చేయకుంటే కొవ్వు ఎక్కువైంది అంటున్నారు.
ఏ విషయం గురించైనా మాట్లాడితే చెత్తగా మాట్లాడానని అంటారు. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే నాకు యాటిట్యూడ్ అని అంటున్నారు అని తన మీద వస్తున్న కామెంట్లను విశ్లేషించింది రష్మిక. ‘‘నన్ను విమర్శించే వాళ్ల సమస్య ఏంటో అర్థం కావడం లేదు. నేను ఇండస్ట్రీలో ఉండాలా, వెళ్లిపోవాలా. ఆ విషయం అయినా సూటిగా చెబితే ఆ పని చేయడానికి నేను రెడీ. అసలు నా మీద ఎందుకు ఇంత నెగెటివిటీ చూపిస్తున్నారో నాకు అర్థం అర్థం కావడం లేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రష్మిక.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా నెటిజన్లు, ట్రోలర్లు రష్మికను వదిలేస్తారో లేక ఈ మాటల్ని పట్టుకుని ఇంకా ట్రోల్ చేస్తారో చూడాలి. గతంలో రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యల విషయంలో మొదలైన ట్రోలింగ్ ఆ తర్వాత ఆమె ఏం చేసినా అనడం మొదలుపెట్టారు. దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు అనేది తెలియడం లేదు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?