Rashmika: హీరోయిన్ రష్మిక ఆ క్లబ్ లో చేరడం సాధ్యమేనా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక తెలుగులో ఒక్కో ప్రాజెక్ట్ కు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు రష్మిక 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అయితే రష్మిక ప్రస్తుతం హిందీలో పలు ప్రాజెక్ట్ లు చేస్తుండగా ఈ సినిమాలు రిలీజ్ కాకముందే హిందీలో కొత్త ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం హిందీలో రష్మికకు ఉన్న డిమాండ్ కు ఆమె ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా నిర్మాతలు నో చెప్పే అవకాశం ఉండదు. రష్మిక నటించిన హిందీ ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే ఆమెకు 10 నుంచి 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దక్కే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ క్లబ్ లో రష్మిక చేరతారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రష్మిక అభిమానులు మాత్రం రష్మికకు ఉన్న క్రేజ్ కు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువేనని కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప ది రైజ్ హిందీలో కూడా సక్సెస్ సాధించడం రష్మికకు ఒక విధంగా ప్లస్ అయింది. ఇప్పటికే రష్మిక రెండు బాలీవుడ్ సినిమాలలో నటించగా తాజాగా టైగర్ ష్రాప్ కు జోడీగా నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఈ సినిమాకు రష్మిక ఎనిమిది కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. రష్మిక తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్ల నేపథ్యంలో రష్మిక టాలీవుడ్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ లలో హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తుండగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సినిమాసినిమాకు రష్మికకు క్రేజ్ పెరుగుతోంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus