Rashmika Remuneration: పుష్ప2 కు రష్మిక రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

పుష్ప పార్ట్1 లో రష్మిక పాత్ర నిడివి తక్కువే అయినా తన నటనతో ఆ సినిమా సక్సెస్ కావడానికి ఒక విధంగా రష్మిక కారణమయ్యారు. బాలీవుడ్ లో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రష్మికకు ఆ సినిమాలు విడుదల కావడానికి ముందే బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. అయితే పుష్ప పార్ట్2 కు రష్మిక మందన్న ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. పుష్ప పార్ట్1 కు 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న రష్మిక పుష్ప పార్ట్2 కు మాత్రం ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది.

పుష్ప పార్ట్2 కు రష్మిక ఏకంగా 50 శాతం రెమ్యునరేషన్ పెంచడం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే హీరోల రెమ్యునరేషన్లతో పోల్చి చూస్తే మాత్రం టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుసగా విజయాలు అందుకుంటున్న రష్మికకు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో కూడా ఛాన్స్ దక్కినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో రష్మిక నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రష్మికకు సోషల్ మీడియాలో కూడా సినిమాసినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కథ నచ్చితే మాత్రమే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో రష్మికకు వరుస విజయాలు సొంతమవుతున్నాయి. పుష్ప పార్ట్1 హిట్ కావడంతో రష్మిక సంతోషిస్తున్నారు. తరువాత సినిమాలు కూడా ఈ సినిమా స్థాయిలో సక్సెస్ కావాలని రష్మిక కోరుకుంటున్నారు. పుష్ప ది రూల్ తో పాటు రష్మిక నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.

శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు యాసలో రష్మిక అద్భుతంగా నటించి మెప్పించారు. గ్లామరస్ రోల్స్ లోనే కాకుండా డీగ్లామరస్ రోల్స్ లో కూడా నటించగలనని రష్మిక ప్రూవ్ చేసుకున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus