Rashmika: వైరల్ అవుతున్న హీరోయిన్ రష్మిక షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నారని అయితే ఈ విషయాన్ని ఆమె వెల్లడించలేక ఇబ్బంది పడుతున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైరల్ అయిన వార్తలకు సంబంధించి రష్మిక పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయ్ దేవరకొండ, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని రష్మిక తెలిపారు. నాకున్న మంచి స్నేహితులలో విజయ్ దేవరకొండ కూడా ఒకరని ఆ విషయాన్ని నేను నిర్భయంగా చెప్పగలనని తెలిపారు.

సినిమాలలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో రియల్ లైఫ్ లో మేమిద్దరం కలిసి ఏ పని చేసినా అలాంటి అభిప్రాయమే కలుగుతోందని రష్మిక చెప్పుకొచ్చారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయినా అందరూ లవర్స్ లా చూస్తున్నారని రష్మిక అభిప్రాయం వ్యక్తం చేశారు. వెకేషన్ ట్రిప్ కు మా స్నేహితులు కూడా హాజరయ్యారని మాతో పాటు పది మంది స్నేహితులు ఉన్నారని అయితే అందరూ మా ఇద్దరినీ మాత్రమే గుర్తిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

మేము పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అలాంటి కామెంట్లు వస్తున్నాయని రష్మిక అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్మిక చేసిన కామెంట్లు కూడా నిజమేనని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండగా భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో రష్మిక బిజీ అవుతున్నారు. వారసుడు సినిమా సక్సెస్ తో రష్మిక క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

రష్మిక వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్మికకు తెలుగులో కొత్త సినిమాల ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వార్తల గురించి రష్మిక ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus