Rashmika: భార్య పాత్రలకు రష్మిక కేరాఫ్ అడ్రస్ గా మారనుందా?

కెరీర్ తొలినాళ్లలో భార్య పాత్రలు పోషించడానికి పెద్దగా ఇష్టపడరు చాలామంది హీరోయిన్లు. మరీ ముఖ్యంగా పిల్లల తల్లులుగా కనిపించడానికి అస్సలు ఒప్పుకోరు. మొన్నామధ్య “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) సినిమాలో హీరోయిన్ నలుగురు పిల్లల తల్లిగా కనిపించాలి అనేసరికి చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేసారనే విషయం తెలిసిందే. అలాంటిది రష్మిక (Rashmika Mandanna)  గత మూడేళ్లలో నటించిన సినిమాల్లో భారీ హిట్స్ గా పేర్కొన్న “అనిమల్ (Animal), పుష్ప (Pushpa)  , ఛావా(Chhaava)” చిత్రాల్లో భార్య పాత్రలో కనిపించింది రష్మిక.

Rashmika

ముఖ్యంగా.. “అనిమల్ & ఛావా” చిత్రాల్లో ఇద్దరు పిల్లల తల్లిగా రష్మిక మెప్పించడం అనేది గమనించాల్సిన విషయం. ఈ మూడు పాత్రల్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే.. “అనిమల్”లో పోషించిన అంజలి పాత్ర కానీ, “పుష్ప”లో శ్రీవల్లి పాత్ర కానీ, “ఛావా”లో ఏసుబాయ్ పాత్ర కానీ.. అన్నీ పవర్ ఫుల్ భర్తలకు సపోర్టింగ్ భార్య పాత్రలే. చాలా మంది హీరోయిన్లు ఈ తరహా పాత్రలు చేసినప్పటికీ..

ఇలా వరుసబెట్టి అదే తరహా పాత్రలు పోషించి బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఘనత మాత్రం రష్మికకు మాత్రమే సాధ్యపడింది. ప్రస్తుతం రష్మిక (Rashmika) 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకొంటోంది. ఇన్ని ప్యాన్ ఇండియన్ హిట్స్ తర్వాత రష్మిక తన రెమ్యునరేషన్ ను పెంచనుందని కూడా సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ మార్కెట్స్ లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగినా ఇచ్చేసేందుకు రెడీగా ఉన్నారు నిర్మాతలు.

రష్మిక చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన “సికందర్”(Sikandar), ఆయుష్మాన్ ఖురానా , తెలుగులో “ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా”(Kubera) . ఈ సినిమాల తర్వాత రష్మిక కాస్త స్పీడ్ పెంచే అవకాశం ఉంది. తమిళనాట కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే.. ఆమె మాత్రం ప్రస్తుతానికి కొత్త కథలు ఒకే చేయడం లేదట. మరి రెమ్యునరేషన్ పెంచాక ఓకే చేయాలని ప్లాన్ చేస్తుందేమో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus