Rashmika: ప్రశాంత్ నీల్ మూవీలో ఆ బ్యూటీకి ఛాన్స్ దక్కిందా.. నిజం కావాలంటూ?

  • May 23, 2024 / 08:43 PM IST

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటుండగా తన సినిమాలలో హీరోయిన్లను రిపీట్ చేయడానికి ఆయన ఇష్టపడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్ గా ఎంపికయ్యారని సమాచారం అందుతోంది. రష్మికకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రష్మిక కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

చాలా సంవత్సరాల నుంచి ఈ కాంబినేషన్ కు సంబంధించి వార్తలు వినిపిస్తున్నా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సలార్ (Salaar) లో శృతి హాసన్ కు (Shruti Hasaan) ఛాన్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో రష్మికకు ఛాన్స్ ఇచ్చారని తెలిసి ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ మొదలు కావడానికి రెండు నెలల సమయం మాత్రమే ఉంది. రష్మిక రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ఆగష్టు నెల నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుందని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారు. తారక్ లుక్ ఒకింత పవర్ ఫుల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది.

సినిమా సినిమాకు తారక్ పారితోషికంతో పాటు క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా భారీగా సక్సెస్ అయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ విజయాలు దక్కాలని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus