నటిగా కెరీర్ ప్రారంభించిన రెండేళ్లలో స్టార్ హీరోయిన్ గుర్తింపు సంపాదించడం అంత సులభం కాదు. అలాంటి ఫీట్‌ను చేసి చూపించిన కథానాయికగా రష్మిక మందన. కన్నడలో ‘కిర్రాక్ పార్టీ’తో కథానాయికగా మారిన రష్మిక… తెలుగులో ‘ఛలో’తో 2018లో వచ్చింది. తొలి సినిమాతోనే ‘వామ్మో ఏం అమ్మాయిరా బాబూ’ అనిపించుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే ‘సరిలేరు నీకెవ్వరు’తో స్టార్ హీరో సరసన నటించే అవకాశం సాధించేసింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.
వరుస సినిమాలు ఓకే చేసేస్తోంది. ఇప్పుడు కెరీర్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌కి రెడీ అవుతోందని టాక్. రష్మిక ఇప్పటివరకు పోషించిన పాత్రలు చూస్తే… కొన్ని సినిమాలు తప్ప అన్నీ… తనలోని నటిని ఆవిష్కించినవే. వాటన్నింటికి మించి నెక్స్ట్ సినిమా ఉంటుందని టాక్. ‘చి.ల.సౌ’ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్ కొత్త సినిమాలో రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. నాయికా ప్రాధాన్యమున్న కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. కొత్త టాక్ ప్రకారం చూస్తే… ఈ సినిమాలో రష్మిక అమాయకురాలైన యువతిగా కనిపిస్తుంది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఇలానే ఉంటుందని, అదే సినిమాకు హైలైట్ అని కూడా అంటున్నారు. అమాయకురాలైన అమ్మాయి… ఎలా అన్ని కష్టాలను ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేరుకుందనేది సినిమా అని టాక్. ఈ పాత్రలో రష్మిక ఎలా నటిస్తుంది అనేది మనం పెద్దగా ఆలోచించక్కర్లేదేమో.
ఎందుకంటే ఆమె ముఖంలో అందం ఎంతుందో, అంతే క్యూట్‌నెస్ ఉంది. అది చాలు ఆ పాత్రకు అంటున్నారు. రష్మిక ఇప్పటివరకు కొన్ని పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో నటించింది. ‘గీత గోవిందం,’ ‘డియర్ కామ్రెడ్’, ‘పుష్ప’ అలాంటివే. ఇవి కాకుండా మరికొన్ని సినిమాల్లో చేసినా… పర్‌ఫార్మెన్స్ స్కోప్ అంతగా లేనివే. కానీ ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ సినిమాతో కెరీర్ బెస్ట్ ఇద్దామని చూస్తోందట. ఒకవేళ ఈ సినిమాతో నటిగా రష్మిక మరోసారి నిరూపించుకుంటే… ఇలాంటి పాత్రలు మరిన్ని ఆమెను వరిస్తాయేమో చూడాలి.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!