Rashmika: సంతోషంగా ఉంది.. వీడియో పై రియాక్ట్ అయిన రష్మిక!

రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ షేర్ చేసిన వీడియో పట్ల రష్మిక చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ వీడియో పై ఈమె స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సంతోషాన్ని కూడా తెలియజేశారు.

అసలు రష్మిక (Rashmika)  ఇంత సంతోష పడటానికి ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.రష్మిక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో రంజితమే అనే పాట ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఇలా ఎక్కడ చూసినా ఈ పాటకు స్టెప్స్ వేస్తూ ఈ పాటను భారీగా ట్రెండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఒక పెళ్లి వేడుకల్లో 10 సంవత్సరాల వయసు కూడా లేనటువంటి ఒక బుడ్డోడు ఈ పాటకు అద్భుతమైన డాన్స్ చేశారు.ఇలా ఆ కుర్రాడు డాన్స్ వేయడమే కాకుండా ఇతరులతో కూడా ఈ పాటకు స్టెప్స్ వేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోను నేటిజన్ షేర్ చేయడంతో ఈ వీడియో చూసినటువంటి రష్మిక ఈ వీడియో పై స్పందించారు.

ఇలా ఈ చిన్నారి చేసినటువంటి డాన్స్ వీడియో పై రష్మిక స్పందిస్తూ…. ఐ లవ్ దిస్.. ఇలాంటి వీడియోలు నాకెంతో ఇష్టం. ఇలాంటి సాంగ్స్, డ్యాన్స్‌ని మీరు ఆస్వాదిస్తుంటే.. నాకెంతో సంతోషంగా ఉంది అని రష్మిక ఆ డ్యాన్స్ వీడియోపై స్పందించి కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.గతంలో కూడా ఓ చిన్నారి విషయంలో రష్మిక ఈ విధంగానే రియాక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus