Rashmika: నితిన్ – వెంకీ కుడుముల సినిమా నుండి తప్పుకున్న రష్మిక

నితిన్- వెంకీ కుడుముల- రష్మిక కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘భీష్మ’ సూపర్ హిట్ అయ్యింది.3 ఏళ్ళ తర్వాత ఇదే కాంబినేషన్లో ఇంకో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ #VNRTRio ‘ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టుని ఓ వీడియో ద్వారా డిఫెరెంట్ గా అనౌన్స్ చేశారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి రష్మిక తప్పుకున్నట్టు సమాచారం.

వాస్తవానికి రష్మికని (Rashmika) టాలీవుడ్ కి పరిచయం చేసిందే దర్శకుడు వెంకీ కుడుముల. అలాంటిది ఈ ప్రాజెక్టు నుండి ఆమె ఎలా తప్పుకుంటుంది అనేవారు కూడా ఉన్నారు. కానీ రష్మిక ఇప్పుడు ‘పుష్ప 2 ‘ అనే పాన్ ఇండియా సినిమాతో పాటు ‘రెయిన్ బో’ అనే ద్విభాషా(తమిళ, తెలుగు) చిత్రం కూడా చేస్తుంది. అలాగే రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో కూడా భాగమైంది. తెలుగులో మరో సినిమాకి ముందుగానే కమిట్ అయ్యింది.

ఈ క్రమంలో నితిన్ – వెంకీ కుడుముల సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరి రష్మిక స్థానంలో మేకర్స్ ఎవరిని తీసుకుంటారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.ఈ క్రమంలో శ్రీలీల పేరు ఎక్కువగా వినిపిస్తోంది కానీ ఆమె కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పైగా నితిన్ తో ఆమె ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తుంది. వక్కంతం వంశీ ఆ చిత్రానికి దర్శకుడు.

Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin Exclusive Interview | Baby Movie | Filmy Focus

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus