Rashmika: ‘వరిసు’ సినిమాలో నేను చేయడానికేమీ లేదు: రష్మిక

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వరిసు’ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ పాత్ర స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ.. సినిమాలో రష్మిక పాత్రకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. నటనకి అవకాశం ఉన్నా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎందుకో ఆ రోల్ ని స్ట్రాంగ్ గా రాసుకోలేదు. దీంతో కేవలం రెండు పాటల కోసమే కోట్లు వెచ్చించి రష్మికను తీసుకున్నారనే విషయంలో సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి.

‘వరిసు’ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర చేయడంపై ఎట్టకేలకు రష్మిక స్పందించింది. కథ చెప్పినప్పుడే తనకు ఆ విషయం తెలిసిపోయిందని చెప్పుకొచ్చింది. కేవలం విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మాత్రమే ‘వరిసు’ సినిమాను అంగీకరించినట్లు తెలిపింది. అలానే కొన్ని సినిమాల్లో చేసేప్పుడు సెట్స్ కి వెళ్లి ఇతరుల నుంచి చాలా నేర్చుకోవచ్చని.. ‘వరిసు’ షూటింగ్ సెట్ లో తను చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది.

కథ మొత్తం విన్నప్పుడు తన పాత్ర పరిమితమని తెలిసే ఓకే చేశానని తెలిపింది రష్మిక. అది పూర్తిగా తన సొంత నిర్ణయమని.. విజయ్ తో చాలా రోజుల నుంచి సినిమా చేయాలనుకుంటున్నానని.. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదని వివరించింది. రెండు పాటల్లో డాన్స్ చేసే అవకాశం రావడంతో అదరగొట్టేయాలని ముందే ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చింది. అయితే ఓ రోజు సెట్ లో విజయ్ తో ఈ సినిమాలో నేను చేయడానికి రెండు పాటలు తప్ప ఏమీ లేదు సార్ అని సెటైర్ వేశానని చెప్పుకొచ్చింది.

ఓవరాల్ గా నటిగా అన్ని సినిమాలు చేయాలని.. అందులో కమర్షియల్ సినిమాలు కూడా ఉంటాయని తెలిపింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక రష్మిక విషయానికొస్తే.. ప్రస్తుతానికి ఆమె ‘పుష్ప2’ సినిమాలో నటిస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus