బిగ్ బాస్ హౌస్ లోకి రతిక రీ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ మేట్స్ ఓటింగ్ లో లీస్ట్ వచ్చిన వాళ్లని ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో సెలక్ట్ చేశాడు బిగ్ బాస్. దసరా స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా రతికని హౌస్ లోకి రీ ఎంట్రీ చేయించారు. దీంతో హౌస్ మేట్స్ ఎక్స్ పెక్ట్ చేసిందే జరిగింది. ఈవిషయాన్ని ముందుగా కెప్టెన్ అర్జున్ గెస్ కూడా చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి రతిక ఎంట్రీ ఇవ్వగానే శివాజీ కాళ్లకి దండం పెట్టి సారీ అడిగింది.
అంతేకాదు, బిడ్డగా మారి మారం చేస్తూ చాలా విషయాలు చెప్పింది. అన్ సీన్ లైవ్ లో ఏం జరిగిందంటే., రతిక రాగానే శివాజీ బయట గార్డెన్ లో కనిపించాడు. దీంతో శివాజీతో చాలాసేపు మంతనాలు జరిపింది. శివాజీ రూపురేఖలు మార్చేస్తా అంది. ఇది కాదు, మీరు కలర్ వేస్కోవాలి. గ్రూమింగ్ చేస్తా చింపేస్తా , పాటలు పాడుతూ రెచ్చిపోవాలి అంటూ శివాజీకి బాగా దగ్గరయ్యింది. ఇంటికి వెళ్లాక అమ్మా, నాన్న శివాజీ అన్న చెప్పింది ఎందుకు వినలేదు అంటూ మాట్లాడారు అని చెప్పింది.
ఇక నుంచీ తప్పు తెలుసుకున్నాను అని గేమ్ పరంగా మార్పులు చేసుకుంటానని చెప్పింది. తర్వాత తేజ – శివాజీ – రతిక ముగ్గురూ బాల్కనీలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడే తేజ ఏమైనా బయట ఏం జరుగుతోందో చెప్పు అంటూ అడిగితే – తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ కామెడీ చేసింది. పర్లేదు చెప్పచ్చు వైల్డ్ కార్డ్ వాళ్లందరూ కూడా చెప్పారు చెప్పు అన్నాసరే రతిక చెప్పలేదు. ఇక శివాజీ చెప్పకూడదు లే అవన్నీ ఇప్పుడు ఎందుకు వదిలేసేయ్ అని తేజకి నచ్చజెప్పాడు.
రతిక (Rathika Rose) అర్జున్ – అమర్ లతో మాట్లాడుతూ ఏంటి.. వారానికి ఇంట్లో ఒక కెప్టెన్ ఉంటాడా అంటూ మాట్లాడింది. ఈవిషయం నీకు తెలీదా అంటూ అర్జున్ సెటైర్ వేశాడు. ఎపిసోడ్స్ ఏమీ చూడలేదా అని అడిగితే, నేను చూడలేదు అంటూ సమాధానం చెప్పింది. దీంతో అర్జున్ కి ఫీజులు ఎగిరిపోయాయ్. రతిక మళ్లీ హౌస్ లో తన షేడ్స్ ని చూపించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రతిక శోభతో కూడా చాలాసేపు డిస్కషన్స్ పెట్టింది. శోభాశెట్టి నాది భోలే ది నామినేషన్ ఎలా అనిపించింది అని అడిగితే. చూడలేదని చెప్పింది. అలాగే బయట ఏం జరుగుతోందని అడిగినా సమాధానం చెప్పలేదు.
ఇక శోభాశెట్టి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినవాళ్లే వెళ్లిపోతున్నారు. వాళ్లు గేమ్ బాగా ఆడినా కూడా ఎందుకు వెళ్లిపోతున్నారో అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. అంతేకాదు, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్లని అనేను బయట ఏంజరుగుతోందని అడగట్లేదు, ఎందుకంటే నా గేమ్ దెబ్బతింటుంది అని చెప్పింది. దీనికి రతిక అదే బెటర్ అంటూ మాట్లాడింది. ఇక అన్ సీన్ లో శివాజీ భోలేకి బుద్దులు చెప్పాడు. సింపతీ వర్కౌట్ అయి మాత్రమే నువ్వు సేవ్ అయ్యావ్ అంటూ జోస్యం చెప్పాడు. నెక్ట్స్ టైమ్ ఎవరైనా ఏదైనా అంటే వాళ్లకి సమాధానం చెప్పాలి అంటు హితవు పలికాడు. మొత్తానికి అదీ మేటర్.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!