Raventh: 5వ వారం కెప్టెన్ గా రేవంత్..! టాస్క్ లో దుమ్మురేపాడు..!

బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం కెప్టెన్ గా రేవంత్ గెలిచినట్లుగా సమాచారం తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్ రెండో లెవల్లో సూర్య, బాలాదిత్యలతో పోటీ పడిన రేవంత్ దుమ్మురేపాడు. దీంతో 5వ వారం కెప్టెన్ గా రేవంత్ విజయం సాధించాడు. చాలా వారాల నుంచీ కెప్టెన్ అయితే అది చేస్తా, ఇది చేస్తా అంటూ చెప్పిన రేవంత్ ఇప్పుడు ఇంట్లో ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గత వారం కీర్తి కెప్టెన్సీలో బాగా ఫ్రస్టేట్ అయిన రేవంత్, ఈవారం ఎలాగైనా సరే కెప్టెన్ అవ్వాలని అనుకున్నాడు.

అంతేకాదు, అప్పుడు కీర్తికి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. వేరే వాళ్ల కెప్టెన్సీలో వచ్చే పనిష్మెంట్స్ ని తీస్కోవాలి , చెప్పడం మాత్రమే కాదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మరి కీర్తిని ఎలా ట్రీట్ చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, కిచెన్ టీమ్ మొత్తాన్ని మారుస్తానని చెప్పాడు. దీంతో సుదీపని ఖచ్చితంగా కిచెన్ టీమ్ నుంచీ తీసేస్తాడు. అలాగే, వాష్ రూమ్ కడగడం ఇష్టం లేని గీతుకి కూడా ఆ పని ఇచ్చే అవకాశం ఉంది.రేవంత్ కెప్టెన్సీలో ఇంట్లో భారీ మార్పులు చేయడం పక్కాగానే కనిపిస్తోంది.

ఎందుకంటే, గతంలో నాకు కెప్టెన్సీ వస్తే మాత్రం హౌస్ మేట్స్ కి చుక్కలు చూపిస్తానని చాలాసార్లు చెప్పాడు రేవంత్. పని విషయంలో ఎవరికైతే ఏ పని ఇష్టం ఉండదో అదే చేయిస్తానని కూడా అన్నాడు. ఇప్పుడు హౌస్ మేట్స్ కి రేవంత్ కెప్టెన్ అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రేవంత్ కెప్టెన్ అవ్వడం అనేది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. నిజానికి రేవంత్ కి కెప్టెన్సీ ఎలా వచ్చిందంటే.,

హౌస్ లో కెప్టెన్ గా ఉన్న కీర్తిని బిగ్ బాస్ ఈవారం బెస్ట్ పెర్ఫామన్స్ ఇచ్చిన 6గురు ఇంటి సభ్యులని ఎంచుకోమని చెప్పాడు. దీంతో కీర్తి రేవంత్ ని కూడా ఎంచుకుంది. అందుకే రేవంత్ కెప్టెన్ అవ్వగలిగాడు. అంతేకాదు, మొదటి రౌండ్ లో ఫైమాకి రేవంత్ కి కొద్దిగా డిఫరెన్స్ మాత్రమే ఉంది. మొదటి రౌండ్లో రేవంత్ ఓడిపోతానని అనుకున్నాడు. కానీ, అనూహ్యంగా గెలిచి, రెండో రౌండ్ లో కూడా గెలిచి 5వ వారం ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు కెప్టెన్ గా ఇంటి సభ్యులని ఎలా చూస్తాడు ? ఇంట్లో ఎలాంటి భారీ మార్పులు తెస్తాడు అనేది చూడాలి. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus