ఆ స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి కారణం అదే..!

ఇప్పుడంటే కొత్త డైరెక్టర్లు ఎక్కువయ్యి ఆయన కనిపించడం లేదు కానీ.. ఆయన కూడా మంచి ట్యాలెంటెడ్ డైరెక్టర్. అతను ఎవరో కాదు రవి బాబు. కెరీర్ ప్రారంభం నుండీ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ.. విభిన్న చిత్రాలు తెరకెక్కించి మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు రవి బాబు. ఆయన సినిమాల్లో కథే హీరో..! ఇప్పటివరకూ ఆయన ఒక్క స్టార్ హీరోతో కానీ.. మినిమం క్రేజ్ ఉన్న హీరోలతో కానీ సినిమాలు చేయలేదు. ఓ దశలో నాగార్జున, బాలకృష్ణ లతో ఈయన సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. అసలు ఎందుకు అంత పెద్ద అవకాశాలు మిస్ అయ్యాయనేదాని ఆయనే క్లారిటీ ఇచ్చాడు.

రవిబాబు మాట్లాడుతూ… “మొదట్లో నేను యాడ్స్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడిని. ఆ తరువాత నా ఆలోచనలు సినిమా వైపుకు మళ్ళాయి. మొదట్లో నాకు నాగార్జున గారితో సినిమా చేయాలని ఉండేది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఇక బాలకృష్ణగారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. తనతో ఒక సినిమా చేయమని ఆయన నన్ను అడుగుతుంటారు. అయన ‘ఒక కథ చెప్పవయ్యా’ అంటే నేను ఇంతవరకూ చెప్పలేదు. నా దగ్గరున్న కథల్లో ఎవరు దేనికి ఫిట్ అవుతారనే నేను చూసుకుంటాను. హీరోను అనుకుని కథను తయారు చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ముందుగా కథను సిద్ధం చేసుకుని దానికి ఎవరు సెట్ అవుతారనేది ఆలోచించడం కరెక్ట్ పద్ధతి. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కుదర్లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus