సినిమాపై ప్యాషన్ తో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేశారు రవిరెడ్డి. అమెరికాలో ఎం.బి.ఏ చేసిన రవిరెడ్డి.. సినిమాలపై ప్రేమతో న్యూ యార్క్ ఫిలిం అకాడమీలో కోర్స్ చేసి హైదరాబాద్ చేరుకున్నారు. సినిమాలపై దృష్టి పెట్టారు. చూడగానే కట్టి పడేసే స్ఫూరద్రూపానికి.. నటనలో నిష్ణాతుడై ఉండడం కలిసి వచ్చింది. సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసిన క్షణమే.. అప్పటికి ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘ఇంటిలిజెంట్’లో అవకాశం ఇచ్చారు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్, దర్పణం’ వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించారు రవిరెడ్డి. ఆ తరువాత విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన ‘దొరసాని’లో ఛాన్స్ సొంతం చేసుకున్నారు ఈ తెలంగాణా తేజం.
అందులో రవిరెడ్డి పెర్ఫార్మెన్స్ చూసి.. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తన తాజా చిత్రం ‘వి’లో మంచి పాత్ర ఇచ్చారు. రానా దగ్గుబాటి-సాయి పల్లవిలతో వేణు ఊడుగుల రూపొందిస్తున్న ‘విరాటపర్వం’లోనూ నటించే అవకాశం దక్కించుకున్న రవిరెడ్డి.. నరసింహ నంది దర్సకత్వంలో రూపొంది ఇటీవల విడుదలైన ‘డిగ్రీ కాలేజ్’లో ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రంలో తాను చేసిన ‘పోలీస్ ఆఫీసర్ సురేంద్రరెడ్డి’ పాత్రకు చాలా ప్రశంసలు లభిస్తున్నాయని చెబుతున్న రవిరెడ్డి.. అమెరికాలో మోడలింగ్ కూడా చేసి ఉండడం విశేషం. అంతేకాదు.. ఫిట్ నెస్ నిపుణుడు కూడా అయిన రవిరెడ్డి.. ఇంద్రగంటి ‘వి’, వేణు ఊడుగుల ‘విరాటపర్వం’ నటుడిగా తనను బిజీగా చేస్తాయనే నమ్మకం ఉందని చెబుతున్నారు. రవిరెడ్డి స్వస్థలం కరీమ్ నగర్!!
Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!