Ravi Teja: విదేశాల్లో తన వారసులతో రవితేజ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాల షూటింగ్లకి కొంచెం గ్యాప్ ఇచ్చి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళాడు. ఈ క్రమంలో విదేశాలకి వెళ్లి చిల్ అవుతున్నాడు. అవును.. రవితేజ ప్రస్తుతం టోక్యో, జపాన్.. లో ఉన్నాడు. అక్కడ తన వారసులతో కలిసి వీధుల్లో దిగిన ఫోటోలను.. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇందులో రవితేజ కొడుకు మహదాన్, మోక్షదలతో పాటు రవితేజ తమ్ముడి కొడుకు కూడా ఉన్నాడు.ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ కి రవితేజ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు.

‘ టోక్యోలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్నట్టు… బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ’ అంటూ రవితేజ చమత్కారంగా ఓ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. రవితేజ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘ఈగల్’ అనే మరో సినిమాలో కూడా రవితేజ నటిస్తున్నాడు.

‘ధమాకా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ నిర్మాణంలో (Ravi Teja) రవితేజ ఈ సినిమా చేస్తున్నాడు. గతంలో నిఖిల్ తో ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’ కి దర్శకుడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024 జనవరిలో రిలీజ్ కాబోతుంది. అలాగే ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తో కూడా ఓ సినిమా చేయడానికి రవితేజ ఓకే చెప్పాడు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus