Ravi Teja, Siddu Jonnalagadda: రవితేజ మూవీలో సిద్దు జొన్నలగడ్డ.. క్రేజీ కాంబో మరోసారి

మాస్ మహారాజ్ రవితేజ  (Ravi Teja) లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) రిలీజ్ కి రెడీగా ఉంది. హరీష్ శంకర్ (Harish Shankar)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ చాలా వరకు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆగస్టు 15న ‘మిస్టర్ బచ్చన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తుంది.

ఇది క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. కానీ ఇన్సైడ్ టాక్ వేరేగా ఉంది. సిద్దూ జొన్నలగడ్డ .. రవితేజ సినిమాలో కనిపిస్తుంది అయితే నిజమేనట..! అందుతున్న సమాచారం ప్రకారం.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యిందట. 2 రోజుల తర్వాత ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తారని తెలుస్తుంది.

అందులో సిద్ధూ కామియో ఉండొచ్చని టాక్. ఇక రవితేజ – భాను భోగవరపు కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే ఫిబ్రవరిలో రిలీజ్ చేయొచ్చు. గతంలో కూడా రవితేజ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కనిపించాడు.

2010 లో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా ‘డాన్ శీను’ (Don Seenu) లోని ఫస్ట్ ఫైట్లో సిద్ధూ జొన్నలగడ్డ కనిపిస్తాడు. 14 ఏళ్ళ తర్వాత మరోసారి రవితేజ సినిమాలో కనిపించబోతున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus