Ravi Teja: మాస్ మహారాజా స్పీడ్ చూశారా..?

టాలీవుడ్ లో మాస్ మహారాజాకి ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎన్ని డిజాస్టర్లు పడుతున్నా.. ఆయన జోరు మాత్రం తగ్గడం లేదు. ‘క్రాక్’ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసేలోపే ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు ఆయన్ను తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకే ‘ధమాకా’ మీద తన ఆశలన్నీ పెట్టుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సోసోగా వెళ్తున్నాయి.

డిసెంబర్ 23న రిలీజ్ అంటే ప్రమోషన్స్ గట్టిగా చేయాల్సిఉంటుంది . పబ్లిసిటీ వేగం పెంచితేనే సినిమా జనాల్లోకి రీచ్ అవుతుంది. ఇదిలా ఉండగా.. రేపు రిలీజ్ కాబోతున్న విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’కి రవితేజనే నిర్మాణ భాగస్వామి. ఈ సినిమాతో పోటీగా ‘హిట్2’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ‘హిట్2’తో పోలిస్తే ఈ డబ్బింగ్ సినిమాను మనవాళ్లు పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేరు. మినిమమ్ బుకింగ్స్ అనేవి లేవు. సినిమాకి హిట్ టాక్ వస్తే తప్ప పికప్ అవ్వడం కష్టం.

ఈ వ్యవహారాలపై రవితేజ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. చిరంజీవితో కాంబినేషన్ సన్నివేశాల్లో రవితేజ పాల్గొంటున్నారు. ఇక్కడితో రవితేజ కాంబినేషన్ సీన్స్ పూర్తవుతాయి. ఈ సినిమాలు కాకుండా ‘రావణాసుర’, ‘ఈగల్’ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలను వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పూర్తి చేయాలి.

ఆ తరువాత ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసం తన లుక్ ని మార్చుకొని షూటింగ్ లో పాల్గొంటారు. వీటన్నింటి ఒత్తిడి రవితేజపై ఉంటుంది. ఇప్పుడేమో ‘ధమాకా’, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొనాల్సి ఉంది. మొత్తానికి హిట్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఈ తరం హీరోలతో పోటీ పడుతున్నారు రవితేజ.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus