Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న న్యూస్ ఇదే!

మాస్ మహారాజ్ రవితేజ నటించి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ఖిలాడీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దారుణంగా కలెక్షన్లు వచ్చాయి. రవితేజ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందు రవితేజ డైరెక్టర్ రమేష్ వర్మపై పరోక్షంగా కొన్ని కామెంట్లు చేయగా ఆ కామెంట్ల గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరిగింది. రమేష్ వర్మ భార్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సైతం చర్చనీయాంశం అయ్యాయి.

అయితే రవితేజ రమేష్ వర్మకు మరో ఛాన్స్ ఇచ్చారని ఇండస్ట్రీలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో వీర, ఖిలాడి సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. రెండు డిజాస్టర్లు ఇచ్చినా రవితేజకు రమేష్ వర్మపై నమ్మకం పోలేదా అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయితే రవితేజ రమేష్ వర్మకు ఛాన్స్ ఇచ్చింది తన సినిమా కోసం కాదు.

రవితేజ బ్రదర్ రఘు కొడుకు మాధవ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, కథనం, మాటలు రమేష్ వర్మ అందించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందని బోగట్టా. ఎంతోమంది హిట్ ఇచ్చిన డైరెక్టర్లు ఉండగా రవితేజ మాత్రం రమేష్ వర్మనే నమ్ముతూ ఉండటం గమనార్హం. రవితేజ నమ్మకాన్ని రమేష్ వర్మ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.

రవితేజ కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మాధవ్ హీరోగా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. రవితేజ ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు రవితేజ కోరుకున్న సక్సెస్ ను అందిస్తాయో లేదో చూడాల్సి ఉంది. రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus