మాస్ మహారాజా రవితేజకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అయితే కొంతకాలం పాటు ఆయన చేసిన సినిమాలేవీ కూడా వర్కవుట్ అవ్వలేదు. మధ్యలో ‘క్రాక్’ అనే భారీ హిట్టు సినిమా చేశారు. ఆ తరువాత మళ్లీ ఫ్లాపులే. దీంతో రవితేజ మార్కెట్ పై ఎఫెక్ట్ పడింది. ఒక హిట్టు, ఆ తరువాత వరుస ప్లాప్ లు.. ప్రతీసారి ఇదే రిపీట్ అవుతూ వస్తోంది. అయితే 2010లో మాత్రం రవితేజ వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్నారు.
‘డాన్ శీను’, ‘మిరపకాయ్’ సినిమాలు రవితేజ క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. అక్కడి నుంచి మళ్లీ కంటిన్యూస్ గా రెండు హిట్స్ అయితే ఆయనకు లేవు. మళ్లీ ఇంతకాలానికి వరుసగా రెండు హిట్లు అందుకున్నారు రవితేజ. డిసెంబర్ లో ఆయన నటించిన ‘ధమాకా’ సినిమా విడుదలైంది. ఆ సినిమా రొటీన్ గా ఉందనే కామెంట్స్ వినిపించినా.. భారీ కలెక్షన్స్ ను వసూలు చేసి నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చింది.
రవితేజ కెరీర్ లో తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ‘ధమాకా’ సినిమా ఆడుతోంది. అలానే ఆయన నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కీలకం. రవితేజ లేకపోతే సినిమాకి ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదని చిరంజీవి స్వయంగా చెప్పారు. అంటే సినిమాలో రవితేజ పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాలో చిరుతో పోటీగా నటించారు రవితేజ.
ఆయన స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. మూడు రోజులకే రూ.108 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా. లాంగ్ రన్ లో రెండొందల కోట్ల వరకు వెళ్లినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు రవితేజ. ఈ సినిమాల హిట్స్ ఆయన నటిస్తోన్న ‘రావణాసుర’, ‘ఈగల్’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది. మరి తన నెక్స్ట్ సినిమాతో రవితేజ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి!
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?