Ravi Teja: బండ్ల గణేష్ కి మరో ఛాన్స్ ఇవ్వబోతున్న రవితేజ!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా.. సినిమాల్లో నటించిన బండ్ల గణేష్.. అటు తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యాడు. అయితే అటు తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా నిర్మాత‌ అవతారం ఎత్తాడు. అతనికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన హీరో ర‌వితేజ. ‘ఆంజ‌నేయులు’ సినిమాతో బండ్లగణేష్ ను నిర్మాతను చేశాడు. ఆ సినిమా 76 రోజుల్లో అతి తక్కువ బడ్జెట్ లో తీశారు. దీంతో బ్యాడ్ టాక్ వచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయిపోయింది.

అయితే అటు తర్వాత పవన్ కళ్యాణ్ తహా ‘తీన్‌ మార్‌’ చేశాడు బండ్ల. ఆ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. దీంతో పవన్ మళ్ళీ పిలిచి ‘గ‌బ్బ‌ర్ సింగ్’ అవకాశం ఇచ్చాడు. అది సూపర్ హిట్ అయ్యి.. ‘తీన్ మార్’ చేదు జ్ఞాపకాలను మరిపించింది. అయితే అటు తర్వాత బండ్ల .. అల్లు అర్జున్ తో నిర్మించిన ‘ఇద్దరమ్మాయిలతో’, చరణ్ తో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ , ఎన్టీఆర్ తో చేసిన ‘బాద్ షా’ సినిమాలు పెద్ద వర్కౌట్ కాలేదు.

ఎన్టీఆర్ తో ‘టెంపర్’ అనే మరో సినిమా నిర్మించినా అది కూడా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టలేదు. దీంతో నిర్మాతగా కూడా తొందరగానే ఫేడౌట్ అయిపోయాడు బండ్ల. అయితే ఇప్పుడు మళ్ళీ నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రవితేజతోనే మళ్ళీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. ముందుగా పవన్ కళ్యాణ్ ను పట్టుకున్నాడు కానీ ఆయన ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేడు. అందుకే రవితేజని లైన్లో పెట్టేశాడు.

‘ధమాకా’ సక్సెస్ మీట్ లకు పిలవకుండానే వెళ్లి మరీ స్టేజి పై భజన చేసి వచ్చాడు. ఇక ట్విట్టర్ లో అయితే రవితేజకి క్రీం బిస్కట్లు వేస్తూ ట్వీట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఫైనల్ గా రవితేజ బండ్లతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.రవితేజని ఎంత పారితోషికం అయినా తీసుకో అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. దీంతో రవితేజ కథలు వినడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ రెండు, మూడు కథలు విన్నాడు. ఇంకా వినడానికి రెడీగా ఉన్నాడు. కథ ఓకే అయితే చాలు ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెంటనే వెళ్ళిపోతుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus